ఆక్సిజన్ మూవీ రివ్యూ 

తారాగణం: గోపీచంద్, రాశి ఖన్నా, అను ఇమ్మానుయేల్, జగపతి బాబు, అభిమన్యు సింగ్, అలీ

దర్శకత్వం: ఏ ఎం జ్యోతి కృష్ణ

సంగీతం: యువన్ శంకర్ రాజా

నిర్మాత: ఏ ఎం రత్నం

ప్రసాద్ (గోపీచంద్) పెళ్లిచూపులు అమెరికా నుండి ఓ గ్రామానికి వస్తాడు. పెళ్లికూతురు రాశి ఆ ఊరి పెద్దమనిషయిన జగపతి కూతురు. వారి కుటుంబానికి శత్రువులనుంచి ప్రాణభయం ఉంటుంది. కుటుంబంలో అందరికి ప్రసాద్ నచ్చిన రాశి మాత్రం అతన్ని వద్దనుకుంటుంది ఎందుకంటే పెళ్ళయితే అమెరికా వెళ్లిపోవాల్సి వస్తుంది గనుక. ఈ క్రమంలో ఒక రోజు వారి పై ఎట్టాక్ జరుగగా ప్రసాద్ వీరోచితంగా అందరిని కాపాడుతాడు, దానికి మెచ్చి రాశి ప్రేమలో పడుతుంది. కానీ ఇంతలోనే ప్రసాద్ గురుంచి ఓ భయంకరమైన నిజం తెలిసి అవాక్కవుతుంది. ప్రసాద్ ఎవరు? అతడి గతం ఏమిటి? ఎందుకు ఆ వూరికి వచ్చాడు వంటి ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఆక్సిజన్ థియేటర్లలో చూడాల్సిందే.

ఆక్సిజన్ మూవీ రివ్యూ

ఎట్టకేలకు ఆక్సిజన్ విదులయ్యింది. ‘నీ మనసు నాకు తెలుసు’ విడుదలై దశాబ్దమున్నర కలం తర్వాత జ్యోతి కృష్ణ తీసిన చిత్రమిది. చిత్ర విశేషాలు పరిశీలిద్దాం.

స్క్రీన్ప్లే:

ఆక్సిజన్ అని చిత్రమైన పేరు పెట్టినా చిత్రం మాత్రం మూస మాస్ చిత్ర ధోరణి లోనే సాగుతుంది. పాత చింతకాయ పచ్చడి వంటి కాన్సెప్ట్ ను ఎంచుకొని, దాన్ని మరింత పురాతన జాడిలో వేసినట్లుంటుంది ఆక్సిజన్. ప్రథమార్థం పల్లెటూరి వాతావరణంలో ఫామిలీ డ్రామా, కామెడీ తో కొంతవరకు సరదాగానే ఉంటుంది చిత్రం. ఇంటర్వెల్ లో ట్విస్ట్ తో కథ మలుపు తిరిగి ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ ఫ్లాష్ బ్యాక్ నిరుత్సాహపరుస్తుంది. ఇదివరకు చూసిన చాల చిత్రాలు గుర్తుకు వస్తాయి. రొటీన్ సన్నివేశాలు, పటుత్వం లేని కథనం, తేలిపోయే సీన్లతో సాగతీతగా బోరుకొట్టిస్తుంది ద్వితీయార్థం. క్లైమాక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది.

సాంకేతికత:

యువన్ శంకర్ రాజా సంగీతం చాలా సాధారణంగా ఉంది. ఛాయాగ్రహం కూడా హీరో బిల్డ్ అప్ సీన్లు, మూస మసాలా చిత్రాలలో ఏముంటుందో అదే ఉంది. కాలం చెల్లిన డైలాగ్స్ చిరాకు పుట్టిస్తాయి.

తారాబలం:

గోపీచంద్ మ్యాన్లీగా మాస్ పెర్ఫార్మన్స్ పండించాడు. పల్లెటూరి అమ్మాయిగా రాశి చక్కగా నటించింది. సానుభూతికర పాత్రలో అను ఇమ్మానుయేల్ కూడా మంచి నటన ప్రదర్శించింది. అయితే ఆమె అన్ని ఎమోషన్స్ కు ఒకే ఎక్స్ప్రెషన్ పలికిస్తుంది. ప్రథమార్థంలో అలీ కామెడీ కితకితలు పెడుతుంది. జగపతి బాబు, అభిమన్యు సింగ్, శ్యామ్, బ్రహ్మాజీ ఇతర పాత్రలు పెద్ద కొత్తగా ఏమి అనిపించవు.

చివరి మాట: జీవం లేని ఆక్సిజన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *