అవుకు రాజు పాత్ర‌లో క‌న్న‌డ అభిన‌య చ‌క్ర‌వ‌ర్తి సుదీప్‌

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన తారాగణంగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి`.

వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో క‌న్న‌డ సూప‌ర్‌స్టార్, అభిన‌య చ‌క్ర‌వ‌ర్తి సుదీప్ అవుకు రాజు అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 2న సుదీప్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అవుకు రాజు గా సుదీప్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here