అల్లు అర‌వింద్ అలా ఎలా మోస‌పోయాడు..?

అదేంటి అల్లు అర‌విందే పెద్ద మాయ‌గాడు.. ఆయ‌న్ని మోసం చేసేంత తెలివితేట‌లు మ‌న ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి ఉన్నాయి అనుకుంటున్నారా..? ఎంత పెద్ద మాయ‌గాడు అయినా కూడా ఒక్కోసారి మోస‌పోతాడు. ఇప్పుడు ఈయ‌న విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న పేప‌ర్ బాయ్ సినిమాను విడుద‌ల చేసాడు. గీతాఆర్ట్స్ డిస్ట్రిబ్యూష‌న్ లోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసారు. సినిమా చూసి న‌చ్చి.. బ‌డ్జెట్ కంటే కోటి రూపాయ‌లు ఎక్కవిచ్చి మ‌రీ అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని కొన్నాడు.

paper-boy

సంప‌త్ నంది మీద నమ్మ‌క‌మో లేదంటే నిజంగానే సినిమా అంత బాగా న‌చ్చిందో తెలియ‌దు కానీ తీసుకున్నాడు.
అయితే ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత సినిమాకు వాళ్లు ఊహించిన రెస్పాన్స్ అయితే రావ‌డం లేదు. ప్ర‌తీ సీన్ లోనూ క‌విత్వం ఎక్కువైపోయి ఎటూ కాకుండా పోతున్నాడు పేప‌ర్ బాయ్. తొలిరోజే ఈ చిత్రానికి టాక్ స‌రిగ్గా రాలేదు. హీరో సంతోష్ శోభ‌న్ అద్భుతంగా న‌టించినా కూడా క‌థ‌లో ద‌మ్ము లేక‌పోవ‌డంతో తేలిపోయింది. డ‌బ్బులు రావంటే సొంత వాళ్ళ‌తోనే సినిమాలు చేయ‌డు అల్లు అర‌వింద్.. అలాంటి నిర్మాత‌నే త‌న క‌థ‌తో ప‌డేసాడు సంప‌త్ నంది. చాలా ఏళ్ళ త‌ర్వాత అల్లు అర‌వింద్ ఓ క‌థ‌ను త‌ప్పుగా జ‌డ్జ్ చేసాడు. పేప‌ర్ బాయ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో విఫ‌ల‌మైంది. మ‌రి దీనికి ప‌రిహారంగా సంప‌త్ నంది నుంచి అల్లు అర‌వింద్ ఏం ఆశిస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here