అల్లుడు కోసం చిరు వ‌స్తున్నాడా..?

ఇప్ప‌టికే అల్లుడు వ‌చ్చాడు క‌దా మ‌ళ్లీ ఇంకో అల్లుడు ఎక్క‌డ్నుంచి వ‌స్తున్నాడు.. ఈయ‌న ఎవ‌రి కోసం వెళ్తున్నాడు అనుకుంటున్నారా..? ఇక్క‌డ అల్లుడు అంటే మెగా అల్లుడు కాదు.. శైల‌జారెడ్డి అల్లుడు. అంటే నాగ‌చైత‌న్య అన్న‌మాట‌.. అక్కినేని, మెగా హీరోల మ‌ధ్య ఉన్న రిలేష‌న్స్ గురించి కొత్త‌గా చెప్పేదేం ఉంది.

CHIRANJEEVI SAILAJA REDDY ALLUDU

వాళ్లిద్ద‌రూ ఒక‌రి కోసం ఒక‌రు అన్న‌ట్లుంటారు. పైగా నాగార్జున‌కు చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్ ప్ల‌స్ బిజినెస్ పార్ట్ న‌ర్ కూడా. అందుకే ఒక్కోసారి నాగ్ త‌న‌యుల‌కు కూడా కావాల్సిన స‌పోర్ట్ చిరు చేస్తుంటాడు. హ‌లో సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కు చిరంజీవి వ‌చ్చాడు. అంతేకాదు అఖిల్ త‌న‌కు సొంత కొడుకు లాంటి వాడు అని చెప్పాడు. ఇక చ‌ర‌ణ్ కూడా అఖిల్ కోసం వ‌చ్చి త‌మ్ముడు అన్నాడు. ఇప్పుడు నాగ‌చైత‌న్య కోసం చిరంజీవి వ‌స్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

శైల‌జారెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబ‌ర్ 9న ప్లాన్ చేస్తున్నారు. హైద‌రాబాద్ లోనే జ‌ర‌గ‌నున్న ఈ వేడుక కు చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా వ‌స్తున్నాడ‌ని తెలుస్తుంది. ముందు ఈ వేడుక‌కు ఎన్టీఆర్ ను పిల‌వాల‌నుకున్నారు. రాధాకృష్ణ నిర్మాత కావ‌డంతో అదే సంస్థ‌లో ఇప్పుడు అర‌వింద స‌మేత చేస్తున్నాడు కాబ‌ట్టి ఎన్టీఆర్ వ‌స్తాడ‌నే అనుకున్నారంతా.

అత‌డితో పాటు త్రివిక్ర‌మ్ కూడా. అయితే ఇప్పుడు హ‌రికృష్ణ పోయిన బాధ‌లో ఉన్న ఎన్టీఆర్ ను ఇలా పిలిచి బాధ పెట్ట‌డం ఇష్టం లేని ద‌ర్శ‌క నిర్మాత‌లు.. చిరంజీవిని తీసుకొస్తున్నార‌ని తెలుస్తుంది. పైగా ఈ మ‌ధ్య అంద‌రి వేడుక‌ల‌కు వెళ్లి ఆశీర్విస్తున్నాడు మెగాస్టార్. ఇప్పుడు చైతూను కూడా ఇలాగే విష్ చేయ‌డానికి రానున్నాడు అన్న‌య్య‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here