అల్లుఅర్జున్ తో కొత్త హీరోయిన్..

అవునా.. ఇప్పుడు ఎవ‌రా కొత్త హీరోయిన్..? ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఇంత మంది హీరోయిన్లు ఉండ‌గా మ‌ళ్లీ ఇంకో కొత్త భామ‌ను తీసుకొస్తున్నాడా అల్లు వార‌బ్బాయి అనుకుంటున్నారా..? అవును.. కొత్త హీరోయిన్ వ‌చ్చింది.. ఆల్రెడీ బ‌న్నీ లైఫ్ లోకి ఆమె వ‌చ్చి కూడా ఆరేళ్ల‌వుతుంది.

ALLU ARJUN WITH HIS WIFE SNEHA REDDY

అదేంటి అనుకుంటున్నారా.. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. స్నేహారెడ్డి. స్వ‌యానా బ‌న్నీ భార్య‌. ఇదివ‌ర‌కు చాలా ప‌ద్ద‌తిగా సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించిన స్నేహ‌.. ఈ మ‌ధ్యే హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడున్న మ‌న ముద్దుగుమ్మ‌లు కూడా కుళ్ల‌కునేంత అందంగా మారిపోయింది. తాజాగా అల్లు అర్జున్ తో క‌లిసి ఈమె ఇచ్చిన పోజు చూసి అంతా షాక్ అవుతున్నారు. స‌డ‌న్ గా చూస్తే ఎవ‌రో హీరోయిన్ అనుకోవ‌డం మాత్రం ఖాయం.

ఈ జంట ఫోటో చూసి అభిమానుల దిష్టే తగిలేలా ఉంది. ఈ మ‌ధ్యే ఓ ఎంగేజ్ మెంట్ పార్టీకి వెళ్లారు ఈ జంట‌. అక్క‌డే ఈ పోటోకు పోజిచ్చారు. నా పేరు సూర్య త‌ర్వాత ఖాళీగా ఉన్న బ‌న్నీ.. ఇలా కుటుంబంతో క‌లిసి టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తానికి సినిమాలు లేక‌పోయినా ఫ్యామిలీ టైమ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here