అమ్మ చెప్పింది.. ర‌ష్మిక విడిపోయింది..

అవును.. ఇప్పుడు క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. పెళ్లికి ముందే మ‌రో జంట కూడా విడిపోయింది. త్రిష లాంటి సీనియ‌ర్లు చూపించిన దారిలో ర‌ష్మిక కూడా న‌డిచింది. ఎంగేజ్ మెంట్ త‌ర్వాత పెళ్లి క్యాన్స‌ల్ చేసుకోవ‌డం ఇప్పుడు ఫ్యాష‌న్ అయిపోయింది. పెళ్లికి రెండేళ్లు టైమ్ అడిగిన‌ప్పుడే ర‌ష్మిక పెళ్లి జ‌రుగుతుందా అనే అనుమానం వ‌చ్చింది అంద‌రికీ. అయితే ఇప్పుడు అది నిజ‌మైపోయింది.

RASHMIKA MANDANNA

రక్షిత్ శెట్టితో ర‌ష్మిక బ్రేక‌ప్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్. ఈ ఇద్ద‌రూ విడిపోతున్నార‌ని కొంత కాలంగా వార్త‌లు వ‌స్తున్నా కూడా ఎవ‌రూ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. ర‌ష్మిక త‌ల్లే చెప్పింది కూతురు ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయింద‌ని. ఇంత‌కంటే సాక్ష్యం ఏం కావాలి..?

మ‌రోవైపు ర‌ష్మిక కూడా త‌న బ్రేక‌ప్ గురించి అన్ని విష‌యాలు పూర్తిగా వివ‌రిస్తానని.. ముందుగానే ఎవ‌రూ ఏది ఊహించుకోవ‌ద్ద‌ని చెబుతుంది. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను కూడా న‌మ్మొద్ద‌ని చెబుతుంది ర‌ష్మిక‌. ర‌క్షిత్ తో త‌ను విడిపోవ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. నిజానికి కిరిక్ పార్టీ టైమ్ లో తాను ఇంత పెద్ద స్టార్ అవుతాన‌ని బ‌హుశా ర‌ష్మిక కూడా ఊహించి ఉండ‌దు. ఇప్పుడు ఆమె ఎదుగుతున్న తీరు చూసి ర‌క్షిత్ శెట్టి కూడా షాక్ అవుతున్నాడు. ఇలాంటి టైమ్ లో కండీష‌న్లు పెడితే కాపురాలే అస్స‌లు నిల‌బ‌డ‌వు.. అలాంటిది జ‌స్ట్ నిశ్చితార్థం అయింది. ఎలా ఇంక ఇది నిల‌బ‌డుతుంది చెప్పండి..? అందుకే త‌న‌కు నీ బంధం వ‌ద్ద‌ని తెంచేసుకుని వ‌చ్చేసింది ర‌ష్మిక‌. ప్ర‌స్తుతం ఈమె తెలుగులో నాని దేవ‌దాస్.. విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ సినిమాల‌తో బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here