అజిత్ అరిపించాడ‌బ్బా.. ఏం లుక్ సామీ..!

ఈ రోజుల్లో ఓ స్టార్ హీరో సినిమా మొద‌లవ్వాలంటే ఆ హంగామానే వేరు. ర‌చ్చ రంబోలా అవుతుందంతే. కానీ కొంద‌రు మాత్రం త‌మ సినిమాల‌ను చాలా అంటే చాలా సెలెంట్ గా మొద‌లుపెట్టేస్తుంటారు. ఇప్పుడు అజిత్-శివ కూడా అంతే. ఇప్ప‌టికే మూడు సినిమాలు చేసారు.. వెంట‌నే గ్యాప్ ఇవ్వ‌కుండా నాలుగో సినిమాకు ముహూర్తం పెట్టారు. పెద్ద‌గా హ‌డావిడి లేకుండానే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌వుతుంది.

VISWASAM MOVIE FIRST LOOK

వివేగం పోయినా కూడా శివ‌పై ఉన్న విశ్వాసంతో మ‌రో ఆఫ‌ర్ ఇచ్చాడు అజిత్. ఈ సినిమాకు టైటిల్ కూడా విశ్వాసం అనే క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఇప్పుడు ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో అజిత్ ను చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. చాలా ఏళ్ళ త‌ర్వాత డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు అజిత్. రెండూ ఊర మాస్ కారెక్ట‌ర్స్ కావ‌డం విశేషం. ఇప్పుడు ఫ‌స్ట్ లుక్ లో కూడా ఒక‌టి వైట్.. మ‌రోటి బ్లాక్ హెయిర్ తో ర‌ప్ఫాడించాడు.

ఓ ద‌ర్శ‌కున్ని గుడ్డిగా న‌మ్మ‌డం అంటే ఏంటో శివ‌ను అజిత్ న‌మ్మ‌డం చూస్తే అర్థ‌మైపోతుంది. అరె.. మిగిలిన ద‌ర్శ‌కులంతా అజిత్ కోసం వేచి చూస్తుంటే ఆయ‌న మాత్రం శివ‌తోనే సినిమాలు చేస్తానంటూ కూర్చుంటున్నాడు. ఏం మాయ చేసాడో.. ఏం మందు పెట్టాడో కానీ అజిత్ పూర్తిగా శివ మాయ‌లో ప‌డిపోయాడు. ఆ ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేస్తున్నాడు అజిత్. ఓ హీరోకు ద‌ర్శ‌కుడు ఇంత బాగా క‌నెక్ట్ కావ‌డం ఈ మ‌ధ్య కాలంలో ఇదే తొలిసారి.

అస‌లు ప‌క్క ద‌ర్శ‌కుల‌ను ప‌ట్టించుకోకుండా కేవ‌లం ఆయ‌న‌తోనే సినిమాలు చేస్తున్నాడు అజిత్. నాలుగేళ్ల‌ కింద అజిత్ తో వీర‌మ్ చేసి సూప‌ర్ హిట్ అందుకున్నాడు శివ‌. తెలుగులో శౌర్యం, శంఖం, ద‌రువు లాంటి సినిమాలు చేసిన శివ‌.. త‌మిళ‌నాట సిరుత్తైతో పాపుల‌ర్ అయ్యాడు. ఆ త‌ర్వాత అజిత్ వీర‌మ్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు.

అది మొద‌లు అజిత్ కు ఫ్యాన్ అయ్యాడు.. ఆ త‌ర్వాత ట్యూన్ అయ్యాడు. వ‌ర‌స‌గా ఆయ‌న‌తో సినిమాలు చేస్తున్నాడు. వీర‌మ్ అయిపోయింది.. వేద‌లం అయిపోయింది.. వివేగం అయిపోయింది. ఇది ఫ్లాపైంది. అయినా కానీ ఇప్పుడు నాలుగోసారి శివ‌తోనే సినిమా చేస్తున్నాడు అజిత్. ఈ కాంబినేష‌న్ కు మ‌రో ప్ర‌త్యేక‌థ కూడా ఉంది. వీళ్లు కేవ‌లం వి అనే అక్ష‌రంతోనే టైటిల్స్ పెట్టుకుంటారు పైగా చివ‌ర్లో సున్నా ఉంటుంది. వీర‌మ్.. వేదాలం.. వివేగం.. ఇప్పుడు విశ్వాసం అంటూ వ‌స్తున్నారు అజిత్, శివ‌. వీళ్ల‌ను చూస్తుంటే క‌థ కంటే ముందు టైటిల్ బాగుంటే చాలు అనుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రి వివేగంతో అజిత్ కు షాక్ ఇచ్చిన శివ‌.. ఈ సారి ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here