అక్కినేని వారి స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతం..

అంతా క‌లిసి ఏదైనా సినిమా చేస్తున్నారా ఏంటి మ‌ళ్లీ మ‌నం మాదిరే అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు కానీ స‌కుటుంబ స‌ప‌రివార స‌మేంత‌గా మాత్రం వ‌స్తున్నారు. సెప్టెంబ‌ర్ మొత్తానికి అక్కినేని కుటుంబ‌మే ద‌త్తత తీసుకుంది. ఈ ఒక్క నెల‌లోనే ఆ కుటుంబం నుంచి నాలుగు సినిమాలు వ‌స్తున్నాయి. సెప్టెంబ‌ర్ 13 నుంచి ఈ కుటుంబ స‌మ‌రం మొద‌లు కానుంది. ఆ రోజే భార్యాభ‌ర్త‌లు రానున్నారు.

AKKINENI FAMILY IN SEPTEMBER

ఒక్క అఖిల్ కూడా ఇదే నెల‌లో వ‌చ్చుంటే ప‌రిపూర్ణం అయిపోయేది. సెప్టెంబ‌ర్ 13న స‌మంత యు ట‌ర్న్ సినిమాతో వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అదేరోజు నాగ‌చైత‌న్య కూడా శైల‌జారెడ్డి అల్లుడు అంటూ వ‌స్తున్నాడు. ఈ రెండు సినిమాల‌పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ముఖ్యంగా ఆలుమ‌గ‌ల స‌మ‌రం కావ‌డంతో ఆస‌క్తి కూడా అలాగే ఉంది అభిమానుల్లో. ఇద్ద‌రిలో ఎవ‌రు గెలుస్తార‌నే పందేలు కూడా వేసుకుంటున్నారు బ‌య‌ట‌. వీళ్ల‌లో ఇద్ద‌రూ హిట్లు కొడితే ఏ స‌మ‌స్య లేదు కానీ ఏ ఒక్క‌రు విజ‌యం సాధించినా కూడా అది చార‌త్రాత్మ‌క‌మే. ఆలుమ‌గ‌ల ప‌రిస్థితి ఇలా ఉంటే మామా అల్లుళ్లు కూడా ఈ నెల‌లో పోటీకి సై అంటున్నారు.

సెప్టెంబ‌ర్ 27న నాగార్జున దేవ‌దాస్ అంటుంటే.. సెప్టెంబ‌ర్ 28న ఇదం జ‌గ‌త్ అంటున్నాడు సుమంత్. ఇందులో దేవ‌దాస్ కామెడీ అయితే.. ఇదం జ‌గ‌త్ పూర్తిగా మీడియా బ్యాక్ డ్రాప్. శ్రీ‌రామ్ ఆదిత్య దేవ‌దాస్ ను.. ఇద జ‌గ‌త్ ను అనిల్ శ్రీ‌కంఠం తెర‌కెక్కిస్తున్నారు. మొత్తానికి ఈ నెలంతా అక్కినేని సినిమాలే సంద‌డి చేయ‌బోతున్నాయి. మ‌రి వీళ్ల‌లో ఎవ‌రు ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుస్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here