అక్కినేని తాకిడి సుధీర్ త‌ట్టుకుంటాడా..?

సుధీర్ బాబు సినిమా అంటే ఇదివ‌ర‌కు పెద్ద‌గా అంచ‌నాలు కానీ.. ఆస‌క్తి కానీ ఉండేవి కాదు. కానీ స‌మ్మోహ‌నం త‌ర్వాత ఈయ‌న సినిమాల‌పై ఆస‌క్తి పెరిగిపోతుంది. ఈ సినిమాలో అద్భుత‌మైన న‌టన‌తో ఆక‌ట్టుకున్నాడు ఈ హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు సుధీర్ బాబు అర‌డ‌జ‌న్ సినిమాలు చేసాడు.

SUDHEER BABU

హీరోతో పాటు కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ క‌నిపించాడు. కానీ ఎప్పుడూ మ‌హేశ్ బావ‌గానే ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కానీ ఈయ‌న సొంత హీరోగా.. న‌టుడిగా మాత్రం గుర్తింపు రాలేదు. ఇప్ప‌టికీ సొంత గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నాడు ఈ హీరో. అయితే ఇప్పుడు అది వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ప్రేమ‌క‌థాచిత్రం.. భ‌లే మంచి రోజు.. శ‌మంత‌క‌మ‌ణి లాంటి సినిమాలు న‌టుడిగా గుర్తింపు తీసుకొచ్చినా.. స‌మ్మోహ‌నంతో సుధీర్ కెరీర్ ఇంకాస్త హైట్స్ కు చేరిపోయింది.

ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా ఎలా ఉన్నా కూడా సుధీర్ కెరీర్ కు మాత్రం మంచి బూస్ట‌ప్ ఇచ్చేలా క‌నిపిస్తుంది. దాంతో కెరీర్ ను స‌రైన దారిలో పెట్టుకోడానికి ఇదే స‌మ‌యం అని ఆలోచిస్తున్నాడు సుధీర్. అందుకే క‌థల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నాడు. ప్ర‌స్తుతం త‌న సొంత నిర్మాణ సంస్థ‌లోనే న‌న్ను దోచుకుందువ‌టే సినిమా చేస్తున్నాడు సుధీర్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న అక్కినేని భార్యాభ‌ర్త‌లు చైతూ శైల‌జారెడ్డి అల్లుడు.. స‌మంత యు ట‌ర్న్ కు పోటీగా విడుద‌ల‌వుతుంది. న‌న్ను దోచుకుందువ‌టే సినిమాను కొత్త ద‌ర్శ‌కుడు ఆర్ఎస్ నాయుడు తెర‌కెక్కించాడు. ఇది కానీ హిట్టైతే సుధీర్ బాబు మార్కెట్ పెరిగిన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here