అంత‌రిక్షంలో ఆ క‌ష్టం క‌నిపిస్తుంది..

వ‌ర‌స‌గా రెండు విజ‌యాలు వ‌చ్చిన దానికంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ సంతోషిస్తున్నాడు వ‌రుణ్ తేజ్. ఈయ‌న సినిమాపై ఇప్పుడు ద‌క్షిణాది ఇండ‌స్ట్రీ మొత్తం క‌న్నేసి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుకు మాత్ర‌మే తెలిసిన వ‌రుణ్.. ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీని టార్గెట్ చేస్తున్నాడు.

ANTHARIKSHAM 9000KMPH

ఈయ‌న న‌టిస్తున్న స్పేస్ థ్రిల్ల‌ర్ కు అంత‌రిక్షం 9000 కిలోమీట‌ర్ ప‌ర్ అవ‌ర్ టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఈ ఫ‌స్ట్ లుక్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండ‌బోతుందో ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. హాలీవుడ్ సినిమా మాదిరే ఇక్క‌డా జీరో గ్రావిటీలో అంత‌రిక్షంలోకి వెళ్లి ఏదో చేస్తున్నాడు వ‌రుణ్ తేజ్. ఇందులో వ్యోమ‌గామిగా న‌టిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఫిదా 48.. తొలిప్రేమ 24 కోట్లు వ‌సూలు చేసి మ‌నోడి మార్కెట్ ను బాగానే పెంచేసాయి. ఇదే న‌మ్మ‌కంతో ఇప్పుడు ఏకంగా 25 కోట్ల బ‌డ్జెట్ ఉన్న సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు.

ఘాజీ లాంటి సంచ‌ల‌న సినిమా అందించిన సంక‌ల్ప్ రెడ్డి ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టంతో అంత‌రిక్షం సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. క్రిష్ తో పాటు రాజ‌వ్ రెడ్డి.. సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. వ‌రుణ్ తేజ్ కు జోడీగా లావ‌ణ్య త్రిపాఠి.. అదితిరావ్ హైద్రీ న‌టిస్తున్నారు. ఇలాంటి క‌థ‌తో ఇప్పుడు త‌మిళ‌నాట టిక్ టిక్ టిక్ అనే సినిమా వ‌చ్చింది. కానీ ఫ్లాప్ అయింది కూడా. దాంతో ఇప్పుడు తెలుగులో వ‌స్తోన్న ఈ సినిమాపై అంద‌రిదృష్టి ప‌డింది. డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here