పొట్టోడు కాదు.. వీడు చాలా గ‌ట్టోడు సుమీ..!

స్టార్ హీరోల‌కు ఇమేజ్ అడ్డు ఉంటుంది. ఏదైనా కొత్త క‌థ చేయాలంటే వాళ్ల‌కు ఎక్క‌డ‌లేని తిప్ప‌ల‌న్నీ వ‌స్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ బేరియ‌ర్స్ అన్నీ తీసేస్తున్నారు మ‌న హీరోలు. వాళ్ల‌కు న‌చ్చితే ఎలాంటి క‌థ‌లో అయినా ఇమిడిపోతున్నారు. ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా ఇదే చేస్తున్నాడు.

 

ఈయ‌న వ‌ర‌స ఫ్లాపుల‌తో ఇప్పుడు ఎటూ కాకుండా ఉన్నాడు. ఇప్పుడు అర్జంట్ గా ఓ హిట్ కొడితే కానీ షారుక్ ఉన్నాడ‌నే సంగ‌తి ప్రేక్ష‌కుల‌కు గుర్తు రాదు. ఎందుకంటే మ‌రోవైపు స‌ల్మాన్, అమీర్ దున్నేస్తున్నారు. ఒక‌ప్పుడు వాళ్ల‌కంటే తానే తోపు అని నిరూపించుకున్న షారుక్ ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న కెరీర్ లో ఎన్నో ర‌కాల పాత్ర‌లు ట్రై చేసాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు షారుక్. ఎవ‌రెస్ట్ అంత ఇమేజ్ ఉండి కూడా షారుక్ కొత్త క‌థ‌ల వైపు ప‌రుగులు తీస్తున్నాడు.

Zero movie new posters

అనుకున్న‌దే త‌డువుగా ఈయ‌న జీరో అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మ‌రుగుజ్జు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అస‌లు కింగ్ ఖాన్ లాంటి హీరో సినిమాకు జీరో అనే టైటిల్ పెట్ట‌డ‌మే కొత్త‌గా ఉంది. ఇక మ‌రుగుజ్జుగా న‌టించ‌డం మ‌రో విశేషం. త‌నూ వెడ్స్ మ‌నూ.. రాంఝ్నా లాంటి సినిమాలు చేసిన ఆనంద్ ఎల్ రాయ్ దీనికి ద‌ర్శ‌కుడు. అప్ప‌ట్లో విచిత్ర సోద‌రులు కోసం క‌మ‌ల్ ఈ త‌ర‌హా మ‌రుగుజ్జుగా న‌టించాడు. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు షారుక్ ఖాన్ ఆ పాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కూడా సినిమాపై ఆస‌క్తి పెంచేస్తుంది. ఓ వైపు క‌త్రినా.. మ‌రోవైపు అనుష్క శ‌ర్మతో షారుక్ రొమాన్స్ చేస్తున్నాడు. 2018, డిసెంబ‌ర్ 21న జీరో చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో కింగ్ ఖాన్ ఎలాంటి మాయ చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here