యాత్ర మూవీ ప్రివ్యూ.. వైఎస్ఆర్ మాయ చేస్తాడా..

మొదలు పెట్టినప్పుడు కొన్ని సినిమాలపై అంచనాలు అంతగా ఉండవు. కానీ షూటింగ్ పూర్తి చేసుకుంది కొద్ది వాటిపై ఆసక్తి అంచనాలు పెరుగుతుంటాయి. ఇప్పుడు యాత్ర సినిమా కూడా ఇదే లిస్టు లోకి వస్తుంది. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 8న భారీ స్థాయిలో విడుదలవుతుంది యాత్ర సినిమా. ఆనందో బ్రహ్మ సినిమాతో హిట్ కొట్టిన మహి వి రాఘవ  ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కచ్చితంగా ఈ చిత్రం వైఎస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని ఆయన ధీమాగా చెబుతున్నారు.

yatra censor report

మరోవైపు సెన్సార్ టాక్ కూడా బాగానే ఉండటంతో సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా ఎమోషనల్ కంటెంట్ సినిమాలో ఎక్కువగా ఉందని తెలుస్తోంది. క్లైమాక్స్ లో రాజశేఖర్ రెడ్డి చనిపోయే సన్నివేశం కన్నీరు పెట్టిస్తుందంటున్నారు. మమ్ముట్టి నటన కూడా సినిమాకు ప్రాణంగా నిలుస్తుందని చెబుతున్నారు వాళ్ళు. సినిమాలో కేవలం రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఎందుకు చేశాడు అనే కారణాలు మాత్రమే చూపిస్తున్నాడు మహి. ఇది పూర్తిగా వైయస్ రాజశేఖర్రెడ్డి బయోపిక్ కాదు.. దానికి తోడు వైయస్ తప్ప ఇందులో ఇతర నాయకులు ఎవరూ ఉండరు. చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి కూడా యాత్రలో కనిపించరని దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. దాంతో వీళ్లు లేని యాత్ర సినిమా ఎలా ఉండబోతుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *