తెలుగులో పేట్ట ఎగిరిపోయింది.. సంక్రాంతికి లేన‌ట్లే..

కొన్నేళ్లుగా ర‌జినీకాంత్ సినిమాలు త‌మిళ్, తెలుగు అని వేరు వేరు లేదు. అక్క‌డే రోజు విడుద‌ల అవుతుందో.. ఇక్క‌డా అదే రోజు వ‌స్తుంది. ఎందుకంటే ర‌జినీ సినిమాల‌కు భాషా బేధం లేదు. కానీ ఇప్పుడు ఈయ‌న‌కు కూడా ఇది వ‌చ్చేసింది. పేట్ట సినిమా త‌మిళ‌నాట సంక్రాంతికి వ‌స్తుంది కానీ తెలుగులో రావ‌డం లేదు. ఈ సినిమా టీజ‌ర్ ఇప్ప‌టికే సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. గులాబి మొక్క‌కు అంటు క‌ట్టిన‌ట్లు.. చాలా ప‌ద్ద‌తిగా పేట్ట సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు కార్తిక్ సుబ్బరాజ్. అక్క‌డ కొత్త‌ద‌నం ఏం లేదు అలాగ‌ని కొత్త‌గా లేద‌ని చెప్ప‌లేం. ఎందుకంటే ర‌జినీకాంత్ ను ఫ్యాన్స్ ఎలాగైతే చూడాల‌నుకుంటున్నారో అలా చూపిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

Will Superstar Petta Movie not release for sankranthi

క‌థ విష‌యం ప‌క్క‌న‌బెడితే పేట్ట టీజ‌ర్ ఫ్యాన్స్ కు కిక్ ఎక్కిస్తుంది. ర‌జినీ అలా స్టైల్ గా న‌డుచుకుంటూ వ‌స్తుంటే అరెరే నా సామిరంగా అన్న‌ట్లుంది వ్య‌వ‌హారం. ముఖ్యంగా ఆయ‌న వాకింగ్ స్టైల్ ను టీజ‌ర్ మొత్తం వాడేసాడు కార్తిక్ సుబ్బ‌రాజ్. ముఖ్యంగా పేట్ట సినిమా ర‌జినీ గ్రేట్ జ‌ర్నీకి ట్రిబ్యూట్ లా ఉంటుంద‌ని చెబుతున్నాడు ఈయ‌న‌. అంటే క‌థ కంటే ముఖ్యంగా ఆయ‌న స్టైల్.. మేన‌రిజ‌మ్స్ ఇవే బాగా హైలైట్ అవుతాయి అన్న‌మాట‌.

గ‌బ్బ‌ర్ సింగ్ లో ప‌వ‌న్ ను చూపించిన హ‌రీష్ శంక‌ర్ లా.. బుడ్డాలో అమితాబ్ ను చూపించిన పూరీ జ‌గ‌న్నాథ్ లా.. ఓ అభిమానే ద‌ర్శ‌కుడు అయితే ఎలా హీరోను చూపించొచ్చు అనేది ఇప్పుడు పేట్ట‌లో చూపించ‌బోతున్నాడు కార్తిక్ సుబ్బ‌రాజ్. ముఖ్యంగా పేట్ట‌లో ర‌జినీకాంత్ లుక్ కూడా అదిరిపోయింది. పైగా కార్తిక్ ట్రాక్ రికార్డ్ కూడా అదిరిపోయింది. ఒక్క మెర్క్కూరీ త‌ప్పిస్తే మిగిలిన సినిమాల‌న్నీ హిట్టే.

దాంతో ఇప్పుడు ర‌జినీకాంత్ సినిమా కూడా క‌చ్చితంగా ఆడుతుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు అభిమానులు. ముఖ్యంగా ఇప్పుడు ర‌జినీకాంత్ కు భారీ హిట్ అవ‌స‌రం. 2.0 కూడా యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోవ‌డంతో ఇప్పుడు ఈయ‌నకు బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌స‌రం. అయితే త‌మిళ్ ఫ్యాన్స్ పేట్ట‌తో పండ‌గ చేసుకుంటారు కానీ మ‌న వాళ్లు మాత్రం ఈ చిత్రం కోసం ఇంకొన్ని రోజులు ఆగక త‌ప్పేలా లేదు. ఎందుకంటే ఎఫ్ 2.. ఎన్టీఆర్.. విన‌య విధేయ రామాతో మ‌న పండ‌గ హౌజ్ ఫుల్ అయిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here