సాయిప‌ల్ల‌వి జాత‌కం తేల‌డానికి ఉన్న‌ది మూడ్రోజులే..

ఇండ‌స్ట్రీలో తెలియ‌కుండానే కొన్ని సెంటిమెంట్స్ కు అల‌వాటు ప‌డిపోతుంటారు. సాయిప‌ల్ల‌వి విష‌యంలో ఇదే జ‌రుగుతుందిప్పుడు. ఈమె న‌టిస్తోన్న ప‌డిప‌డి లేచే మ‌న‌సు డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. స‌రిగ్గా ఇదే తేదీ రోజు ఏడాది కింద ఎంసిఏ విడుద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయిన రోజే మ‌ళ్లీ ఏడాది త‌ర్వాత ఇంకో సినిమా వ‌స్తుంది. అది కూడా సాయిప‌ల్ల‌వి న‌టిస్తుందే కావ‌డం విశేషం.

saipallavi

శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న ప‌డిప‌డి లేచే మ‌న‌సు డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. 2018లో చివ‌ర‌గా రానున్న పెద్ద సినిమా ఇదే. హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ మ‌ధ్యే విడుద‌లైన పాట‌లు.. ట్రైల‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు సినిమాపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

sai pallavi sharwanand padi padi leche manasu
sai pallavi sharwanand padi padi leche manasu

ఇక ఇదే రోజు త‌మిళ‌నాట ధ‌నుష్ తో న‌టించిన మారి 2 కూడా విడుదల కానుంది. ఒకేరోజు రెండు సినిమాల‌తో రావ‌డం అనేది చిన్న విష‌యం కాదు. ఆ మ‌ధ్య స‌మంత ఇదే చేసింది. తెలుగులో యు ట‌ర్న్.. త‌మిళ‌నాట శివ‌కార్తికేయ‌న్ తో న‌ట‌టించిన సీమ‌రాజా ఒకేరోజు విడుద‌ల అయ్యాయి. రెండూ ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు సాయిప‌ల్ల‌వి మ‌ళ్లీ అదే ఫీట్ చేస్తుంది. మొత్తానికి ఏడాది కింది ఎంసిఏ.. ఇప్పుడు ప‌డిప‌డి లేచే మ‌న‌సు.. మారి 2 సినిమాల‌తో వ‌స్తుంది సాయిప‌ల్ల‌వి. మ‌రి ఈ రెండు సినిమాలు కానీ ఆడితే సాయిప‌ల్ల‌వి రేంజ్ మ‌రింత‌గా పెర‌గ‌డం ఖాయం. దెబ్బ‌కు స్టార్ హీరోయిన్ అయిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి చూడాలిక‌.. డిసెంబ‌ర్ 21న ఏం జ‌రుగుతుందో..?

maari2 Rowdy Baby Song
maari2 Rowdy Baby Song

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here