చిరంజీవి కోసం బాల‌య్య త్యాగం చేస్తాడా..?

ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రి జాతకం ఎలా మారుతుందో చెప్ప‌డం క‌ష్టం. అదేదో సినిమాలో ఆహుతి ప్ర‌సాద్ చెప్పిన‌ట్లు నిన్న రైట్ అనుకున్న‌ది.. రేపు రాంగ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. నిన్న‌టి వ‌ర‌కు చిరంజీవి త‌ర్వాతి సినిమా ఏంటి అంటే బోయ‌పాటితోనే క‌దా అన్నారు. కానీ సీన్ లోకి ఇప్పుడు స‌డ‌న్ గా కొర‌టాల శివ వ‌చ్చాడు. ఈయ‌న ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చేసిన నాలుగు సినిమాలు కూడా బాగానే ఆడాయి. భ‌ర‌త్ అనే నేను కాస్త అటూ ఇటూ అయినా.. క‌లెక్ష‌న్లు మాత్రం 90 కోట్ల‌కు పైగానే వ‌చ్చాయి. దాంతో ఇది కూడా అబౌ యావ‌రేజ్ కిందే లెక్క‌. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ లేని ప్ర‌యాణం అన్న‌మాట‌.

chiru balakrishna

పైగా సందేశాత్మ‌క క‌థ‌ల‌ను బాగా చెప్తాడ‌నే పేరుంది. క‌మ‌ర్షియ‌ల్ హంగులు అద్ది.. మెసేజ్ లు ఇవ్వ‌డంలో బాగా ఆరితేరిపోయాడు కొర‌టాల శివ‌. ఈ మ‌ధ్యే ఈయ‌న చిరంజీవిని క‌లిసాడు.. ఓ క‌థ కూడా చెప్పాడు. ఈ కాంబినేష‌న్ లో అఫీషియ‌ల్ గా సినిమా కూడా అనౌన్స్ అయింది. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి షూటింగ్ మొద‌లు కానుంది. ప్ర‌స్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. దాంతో కొర‌టాల కోసం ఇప్పుడు సైరా జోరు పెంచేసాడు మెగాస్టార్. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ డిసెంబ‌ర్ లోపు సైరా టాకీ పూర్తి చేయాల‌ని సురేంద‌ర్ రెడ్డిని కోరుతున్నాడు చిరంజీవి.

ఇక ఈ చిత్రానికి రైతు అనే టైటిల్ అనుకుంటున్నారు. రైతుల స‌మస్య‌ల‌తోనే ఈ చిత్రం రానుంది కూడా. అయితే రైతు పేరుతో బాల‌య్య సినిమా చేయాల‌నుకున్నాడు. కృష్ణ‌వంశీతో అప్పుడు సినిమా అనౌన్స్ చేసి మ‌రీ ఆపేసాడు. మ‌రిప్పుడు ఈ టైటిల్ చిరు తీసుకుంటే బాల‌య్య ఏమంటాడో..? ఈ టైటిల్ కోసం బాల‌య్య అనుమ‌తి చిరు తీసుకుని ఉంటాడా..? ఏమో ఏం జ‌రిగినా ఇప్పుడు నంద‌మూరి మెగా కుటుంబాల మ‌ధ్య మాత్రం రిలేష‌న్స్ బాగా గ‌ట్టిగా ఉన్నాయి. పైగా చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ తో అదింకా బ‌ల‌ప‌డ‌నుంది. మ‌రి చూడాలిక‌.. చిరు రైతు ఎలా ఉండ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here