ఇంకేంటి.. శీనువైట్ల అంతేగా ఇప్పుడింకా..!

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా చూసిన త‌ర్వాత శీనువైట్ల గురించి మాట్లాడుకోవాల్సి వ‌స్తే స‌గ‌టు సినీ అభిమాని అడిగే ప్ర‌శ్న ఇలాగే ఉంటుంది. హా ఇంకేంటి ఆయ‌న్ని మ‌రిచిపోవ‌చ్చు క‌దా.. ఇప్పుడు ఆయ‌న‌కు ఛాన్స్ ఇచ్చే ధైర్యం ఏ హీరో అయినా చేస్తాడంటారా అని వైట్ల గురించి డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయిప్పుడు. ఎందుకంటే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఆయ‌న తీసిన విధానం అలా ఉంది మ‌రి. అయినా ఒక‌ప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడు ఎలా అయిపోయాడు.. ఇప్పుడు శీనువైట్ల‌ను చూసి ఇండ‌స్ట్రీలో చాలా మంది అనుకుంటున్న మాట ఇది. వ‌ర‌స‌గా మూడు డిజాస్ట‌ర్లు ఇచ్చేస‌రికి శీనువైట్ల‌ను న‌మ్మే ప‌రిస్థితుల్లో ఏ హీరో లేడిప్పుడు. పైగా ఆగ‌డు.. బ్రూస్ లీ.. మిస్ట‌ర్ మూడు భారీ న‌ష్టాల‌నే తీసుకొచ్చాయి.

sreenu vaitla
sreenu vaitla

అలాంటి టైమ్ లో భారీ బ‌డ్జెట్ ఇచ్చి.. ర‌వితేజ లాంటి హీరోను ఇచ్చి.. ఆరేళ్ల త‌ర్వాత ఇలియానాను తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌ట్టుకొచ్చి.. మొత్తం అంద‌రు క‌మెడియ‌న్స్ ను చేతుల్లో పెడితే ఇప్పుడు ఓ డిజాస్ట‌ర్ సినిమాను గిఫ్టుగా ఇచ్చాడు శీనువైట్ల‌. ఈ చిత్రం క‌నీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోవ‌డం లేదు. దాంతో ఈ సినిమా చూసిన త‌ర్వాత వైట్ల గారి బుర్ర‌పైనే డౌట్లు వ‌స్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఎవ‌ర్ని న‌మ్మాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితికి వెళ్లిపోయాడు శీనువైట్ల‌. మొత్తానికి ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే శీనువైట్ల‌ను న‌మ్మ‌డం పూర్తిగా మానేసారు మ‌న నిర్మాత‌లు. దాంతో వెబ్ సిరీస్ వైపు వైట్ల అడుగులు ప‌డుతున్నాయని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *