బీర్ కొడ‌తావా.. విశాల్ పై వివాదం..

ఈ రోజుల్లో వివాదం అనే ప‌దం ఎందుకొస్తుందో కూడా అర్థం కావ‌డం లేదు. క‌నీసం ఆ ప‌దానికి మ‌ర్యాద కూడా ఎవ‌రూ ఇవ్వ‌డం లేదు. ఏం చేసినా వివాదం సృష్టిస్తున్నారు. ఇప్పుడు విశాల్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న త‌న కొత్త సినిమా అయోగ్య ఫ‌స్ట్ లుక్ లో బీర్ బాటిలో చేతిలో ఉంద‌ని ఈ చిత్రంపై వివాదాన్ని రేపుతున్నారు కొంద‌రు. అరే.. టైటిల్ అయోగ్య‌.. అంటే యోగ్య‌త లేని వాడు అని అర్థం.

Vishal-Ayogya-Lands-in-trouble-for-glorifying-drinking

మ‌రి అలాంట‌ప్పుడు సినిమా ఫ‌స్ట్ లుక్ లో బీర్ బాటిల్ కాకుండా పాల సీసా ఉంటుందా..? క‌నీసం అది కూడా అర్థం చేసుకోకుండా.. సినిమాలోని స‌న్నివేశాన్ని ప‌ట్టించుకోకుండా ఏదో కాంట్రవ‌ర్సీ చేసేద్దాం అనే మూడ్ లో ఉంటే ఎలా..? ఇప్పుడు ఇదే ప్ర‌శ్నిస్తున్నారు ఆయ‌న అభిమానులు కూడా. క‌థ‌లో భాగంగానే అలా ప‌ట్టుకున్నాడు విశాల్.

అది చూడ‌కుండా నువ్వు న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు అయి ఉండి అలా బీర్ బాటిల్ చేతిలో ప‌ట్టుకుని నీ ఫ్యాన్స్ కు ఏం మెసేజ్ ఇస్తున్నావ్ అంటూ విశాల్ పై ఫైర్ అవుతున్నారు కొంద‌రు. అస‌లు అందులో ఏదైనా అర్థం ఉందా..? ఆ మ‌ధ్య విజ‌య్ స‌ర్కార్ విష‌యంలోనూ ఇంతే. హీరో సిగెరెట్ తాగుతున్న పోస్ట‌ర్ చూసి వివాదం రేపారు. అంత‌కుముందు ఎన్ని సినిమాల్లో హీరోలు సిగెరెట్లు తాగ‌లేదు.. క‌నీసం ఓ వివాదం సృష్టించేముందు ఎందుకు ఇది సృష్టిస్తున్నాం అనే ఆలోచ‌న కూడా క‌నిపించ‌డం లేదు. ఎంత‌సేపు ప‌ర్స‌న‌ల్ టార్గెట్ ఒక‌టి ఫిక్స్ చేసుకుని గుడ్డెద్దు చేల్లో ప‌డ్డ‌ట్లు దూసుకుపోవ‌డ‌మే కానీ ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ అయితే క‌నిపించ‌డం లేదు అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఇప్పుడు విశాల్ విష‌యంలో రేగిన వివాదం ఎప్పుడు చ‌ల్లారుతుందో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here