వినాయ‌క్ ను ప‌ట్టించుకునే వారు లేరా..?

ఏదో అనుకుంటే ఇంకేదో జ‌రిగిందే అని ఆ మ‌ధ్య నాని ఓ పాట పాడాడు క‌దా.. ఇప్పుడు ద‌ర్శ‌కుడు వినాయ‌క్ కు ఇది స‌రిగ్గా సూట్ అవుతుంది. జులైలో సినిమా మొద‌లుపెట్టి.. ద‌స‌రాకు విడుద‌ల చేస్తాం.. బాల‌య్య కూడా సిద్ధంగా ఉన్నాడు.. ఫ్యాక్ష‌న్ క‌థ చేస్తున్నాం.. అంతా రెడీ అయింద‌ని ఆ మ‌ధ్య స్టేట్మెంట్స్ ఇచ్చాడు వినాయ‌క్. తీరా సీన్ క‌ట్ చేస్తే.. అస‌లు ఈ సినిమానే ఆగిపోయింది. అది వ‌దిలేసి ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌లుపెట్టాడు బాల‌య్య‌.

vv vinayak

దాంతో ఇప్ప‌ట్లో వినాయ‌క్ సినిమా ప‌ట్టాలెక్కేలా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడే కాదు.. అస‌లు బాల‌య్య సినిమా ఉంటుందో లేదో అనే అనుమానం మొద‌లైందిప్పుడు. అఖిల్.. అల్లుడుశీను.. ఇంటిలిజెంట్ సినిమాలు విన‌య్ ఇమేజ్ ను బాగానే దెబ్బ‌తీసాయి.

మ‌ధ్య‌లో ఖైదీ నెం. 150 ఆడినా కూడా అది చిరు మేనియాలో క‌లిసిపోయింది. దాంతో వినాయ‌క్ కు తనను తాను నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు ఇదే ప‌ని కోసం బాల‌య్య‌ను న‌మ్ముకుంటే.. ఆయ‌న కూడా ఈయ‌న్ని ప‌క్క‌న‌బెట్టేసి ఎం చ‌క్కా నాన్న సినిమా మొద‌లుపెట్టాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా వ‌చ్చే జ‌న‌వ‌రిలో విడుద‌ల కానుంది. తీరు చూస్తుంటే అసలు వినాయక్ వైపు బాలయ్య చూపు కూడా చూడటం లేదు. పైగా ఈ సినిమా పూర్తైన తర్వాత బోయపాటి కూడా ఎలాగూ కథ పట్టుకుని సిద్దంగా ఉన్నాడు. దాంతో అప్పుడు కూడా వినాయక్ కు తిప్పలు తప్పవు. మరి ఈ దర్శకుడు ఇప్పుడు ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here