విన‌య విధ్వంస రామ‌.. చ‌ర‌ణ్ విశ్వ‌రూపం.

ఏంటి సినిమా పేరు కానీ మార్చారా ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత అంద‌రికీ అదే అనిపిస్తుంది. విన‌య విధేయ రామ కాదు.. అక్క‌డున్న‌ది విన‌య విధ్వంస రామ‌నే. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ మారిపోయాడు. ఇక ఆయన మాస్ సినిమాలు.. రొటీన్ కథల జోలిక‌స‌లు పోడు అంటూ ఇన్నాళ్లు ఆయన గురించి అభిమానులు అనుకున్న మాటల‌న్నీ ఇప్పుడు ఉత్తిదే అని తేలిపోయాయి.

ఇప్పటికీ అదే చరణ్ లోపల అదే పాత మ‌నిషి ఉన్నాడు.. ఏదో కొత్తగా ఉంది కదా అని రంగస్థలం ట్రై చేసాడు మెగా వారసుడు. అది సక్సెస్ అయింది కానీ మనలో ఉన్న పాత హీరో బయటికి మ‌ళ్లీ వచ్చాడు. దాని ఫలితమే విన‌య విధేయ రామ ట్రైలర్. చరణ్ లాంటి మాస్ హీరోతో బోయపాటి కలిస్తే వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ సినిమా చూపించింది. ఇంతవరకు చరణ్ మాస్ గా చూపించిన దర్శకుడు మరొకరు లేరు. ట్రైలర్ నిండా యాక్షన్ సీన్స్ తో నింపేసాడు బోయపాటి శ్రీను.
అసలు ఈయన టేకింగ్ కు మాస్ ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఏంటి స్వామీ ఈ ర‌చ్చ అంటూ అభిమానులు పొంగిపోతున్నారు. సరైన సింహం తగల నంతవరకు ఎవడైనా వేటగాడేరా.. ఒంట్లో బెరుకు లేదు.. చావంటే భయం లేదు నీలా నాకు సైన్యం లేదు ఇలాంటి డైలాగులతో రామ్ చరణ్ రచ్చ చేశాడు. దానికితోడు యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి. దేవి బ్యాగ్రౌండ్ స్కోర్ చంపేసాడు. ఇవ‌న్నీ విన‌య విధేయ రామ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. కానీ ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం ట్రైల‌ర్ నచ్చలేదు.

అసలు ఏముంది ఈ ట్రైలర్ లో మొత్తం రక్తపాతం తప్ప అంటూ వాళ్ళు పెదవి విరుస్తున్నారు. కానీ బోయపాటి మాత్రం ఇన్నాళ్లు తాను చేసిన సినిమాల కంటే దీన్ని మరింత మాస్ గా తెరకెక్కించాడు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది విన‌య విధేయ‌ రామ. మరి ట్రైలర్ లో ఉన్న మాస్ లో స‌గ‌మైనా సినిమాలో ఉంటే పండ‌క్కి ప్రేక్షకులకు పండగే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here