విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ @ స‌ర్కార్..

నేను సిఎం అయితే లంచం తీసుకునే వాళ్ల తాట తీస్తా.. రాజు అనేవాడు మంచిగా ప‌నిచేస్తే కింద వాళ్లు కూడా అలాగే ప‌ని చేస్తారు. నాయ‌కుడు అనే వాడు ఎప్పుడూ ప్ర‌జ‌ల‌ను పాలిస్తూ కాదు.. లాలిస్తూ ఉండాలి. వాళ్ల‌కు ఏమేం కావాలో తెలుసుకుంటూ ఉండాలి. ఇవ‌న్నీ విజ‌య్ ఇప్పుడు కొత్త సినిమా స‌ర్కార్ ఆడియో వేడుక‌లో మాట్లాడిన మాట‌లు. ఇవి విన్న త‌ర్వాత విజ‌య్ నిజంగానే ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాడేమో అనే అనుమానం వ‌స్తుంది. అయినా త‌మిళ‌నాట ఎప్పుడూ ట్రెండింగ్ టాపిక్ ఇది.

VIJAY POLITICAL ENTRY

ఆయ‌న ఎప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా అని అభిమానులు వేచి చూస్తున్నారు. ఆయ‌న తండ్రి చంద్ర శేఖ‌ర్ కూడా విజ‌య్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే బాగుంటుంద‌ని చెప్పాడు. అయితే ఇప్పుడు త‌న‌కు ఆ ఉద్ధేశ్యం లేదంటున్నాడు ఇళ‌య ద‌ళ‌ప‌తి. దానికి మ‌రో కార‌ణం కూడా ఉంది.

ర‌జినీకాంత్ పిలిచి మ‌రీ నీకు ఇంకా ప‌దేళ్లు టైమ్ ఉంది.. ముందు సినిమాలు చేయ్ అంటూ అప్ప‌ట్లో బాగానే విజ‌య్ క్లాస్ ఇచ్చాడ‌ని కోలీవుడ్ లో మాట‌లు వినిపించాయి. ఆ మాట‌లు వినే త‌న దృష్టంతా సినిమాల‌పై పెట్టాడు విజ‌య్. అయితే తాను చేయాల్సిన సేవ‌లు మాత్రం హీరోగా ఉండే చేస్తున్నాడు ఈ హీరో. ఇప్ప‌టికే అభిమాన సంఘాల నుంచి కూడా ఈ హీరోకు కావాల్సినంత స‌పోర్ట్ ఉంది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు విజ‌య్ పొలిటిక‌ల్ హీట్ పై మ‌రోసారి వార్త‌లు మొద‌ల‌య్యాయి. దానికి కార‌ణం మురుగ‌దాస్. ఈయ‌న సినిమాలో విజ‌య్ పొలిటీషియ‌న్ గా న‌టించ‌డం లేదు కానీ వాళ్ల‌ను శాసించే పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. రియ‌ల్ లైఫ్ లో ఎలాగూ రాజ‌కీయాల్లోకి ఇప్ప‌ట్లో వ‌చ్చేలా లేడు.. సినిమాలో ఏం చేస్తాడో చూడాలిక‌..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here