సిఎం సీట్ పై క‌న్నేసిన విజ‌య్.. శంక‌ర్ సాయం..

విజ‌య్ అంటే ఇప్పుడు త‌మిళ‌నాట ఉన్న క్రేజ్ గురించి మాట‌ల్లో చెప్ప‌డం సాధ్యం కాదు. ఆయ‌నేం చేసినా ఇప్పుడు ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డి మ‌రీ చూస్తున్నారు. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న స‌ర్కార్ కూడా 250 కోట్లు వ‌సూలు చేసిందంటే విజ‌య్ మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇలాంటి టైమ్ లో ఈయ‌న శంక‌ర్ సినిమా చేయాల‌ని చూస్తున్నాడు. అయినా శంక‌ర్ తో సినిమా అంటే ఒక‌ప్పుడు హీరోలంతా ఎగిరి గంతేసేవాళ్లు కానీ ఇప్పుడు కాదు. ఈయ‌నతో పెట్టుకుంటే ఎప్ప‌టికి సినిమా పూర్త‌వుతుందో తెలియ‌ని ప‌రిస్థితి.

Vijay next movie with director shankar

ఇప్పుడు ర‌జినీకాంత్ ను చూస్తుంటే ఇది అర్థ‌మైపోతుంది. ఇదివ‌ర‌కు ఒక్కో సినిమా కోసం రెండేళ్లు తీసుకుంటుంటే.. ఏమోలే ఏదో టైమ్ లో వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉండేది. కానీ ఇప్పుడు 2.0 ను మాత్రం మూడేళ్లు చెక్కాడు ఈ ద‌ర్శ‌కుడు.
ఇది చూస్తుంటేనే నిర్మాత‌ల‌కు భ‌యం వేస్తుంది. 540 కోట్ల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. ఇది సెట్స్ పై ఉండ‌గానే శంక‌ర్ కూడా క‌మ‌ల్ హాస‌న్ తో తాను చేయ‌బోయే భారతీయుడు 2తో బిజీ అయిపోయాడు. ఇండియ‌న్ 2 క‌థ ఇప్ప‌టికే సెట్ అయిపోయి.. సెట్స్ పైకి వెళ్ల‌డానికి రెడీగా ఉంది.

ఇలాంటి స‌మ‌యంలో మ‌రో సినిమా కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు శంక‌ర్. ఇండియ‌న్ 2 త‌ర్వాత ఈయ‌న ఒకే ఒక్క‌డు సీక్వెల్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ఆయ‌నే క‌న్ఫ‌ర్మ్ చేసాడు కూడా. ఈ సినిమా 2020లో తెర‌కెక్కే అవ‌కాశం ఉంది. ఒక్క రోజు సిఎం కాన్సెప్టుతో 17 ఏళ్ల కింద సంచ‌ల‌నం సృష్టించాడు శంక‌ర్. మ‌ళ్లీ ఇప్పుడు విజ‌య్ తో ఇదే సినిమా సీక్వెల్ చేయ‌బోతున్నాడు. మొత్తానికి కొత్త క‌థ‌లు రాయ‌డం మానేసి వ‌ర‌స‌గా పాత క‌థ‌ల‌కు కొన‌సాగింపు ఇస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇది వ‌ర‌కే విజ‌య్, శంక‌ర్ కాంబినేష‌న్ లో న‌మ్బ‌న్ సినిమా వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here