టాక్సీవాలా ట్రైల‌ర్.. ఫ‌న్ అండ్ స‌స్పెన్స్..

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే ప్రేక్ష‌కులు ముందుగా ఊహించుకునేది ఏంటి.. ఎంట‌ర్ టైన్మెంట్ ఎంట‌ర్ టైన్మెంట్.. మ‌నోడి కామెడీ టైమింగ్ అలా ఉంటుంది మ‌రి. గీత‌గోవిందం అంత పెద్ద విజయం సాధించిందంటే దానికి కార‌ణం విజ‌య్ ఇమేజ్ తో పాటు అత‌డి డైలాగ్ డెల‌వ‌రీ కూడా. ఇప్పుడు టాక్సీవాలాలో మ‌రోసారి అదే క‌నిపిస్తుంది. ట్రైల‌ర్ చూస్తుంటే సినిమాలో విష‌యం కూడా ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఇన్నాళ్లూ ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది కాబ‌ట్టి అన‌వ‌స‌రంగా ఈ చిత్రాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నారు కానీ ఇందులో కూడా విష‌యం బాగానే ఉంద‌ని ట్రైల‌ర్ చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. న‌వంబ‌ర్ 17న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

రాహుల్ సంక్రీత్య‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ 2.. యువీ క్రియేష‌న్స్ నిర్మించాయి. చ‌దువు అయిపోయిన త‌ర్వాత ఏం చేయాలో తెలియ‌క ఖాళీగా కాలం గ‌డిపేస్తున్న ఓ కుర్రాడి జీవితంలోకి కార్ వ‌స్తుంది.. అయితే అది మామూలు కార్ కాదు.. అందులో ఏదో మాన‌వాతీత శ‌క్తులు ఉంటాయి. అప్పుడు ఆ కుర్రాడి లైఫ్ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అనేది క‌థ‌. స్టోరీ ఆస‌క్తిక‌రంగానే ఉంది కానీ లేట్ అవ్వ‌డంతో సినిమాపై ఆస‌క్తి త‌గ్గిపోయింది. అయితే ఇప్పుడు ట్రైల‌ర్ తో అవి పెంచే ప‌నిలో ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి చూడాలిక‌.. విజ‌య్ ఇమేజ్.. స్టోరీ.. స‌స్పెన్స్ కామెడీ క‌లిసి టాక్సీవాలాను ఒడ్డున ప‌డేస్తాయో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here