నోటా @ 40 కోట్లు.. విజ‌య్ అంత మోస్తాడా..?

ఒక్క సినిమా హిట్టైంద‌ని ఒకేసారి రేట్ పెంచేస్తే మునిగిపోయిన చాలా సినిమాల‌ను మ‌నం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుందేమో అనే అనుమానం వ‌స్తుంది. ఈయ‌న ఇప్పుడు నోటా సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంపై రెండు భాష‌ల్లో మంచి అంచ‌నాలున్నాయి. పైగా గీత‌గోవిందం త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో బిజినెస్ కు కూడా రెక్క‌లొస్తున్నాయి. ఈ సినిమా 70 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేయ‌డంతో ఇప్పుడు నోటాను 40 కోట్ల‌కు అమ్మేస్తున్నారు.

గీత‌గోవిందంకు చాలా వ‌ర్క‌వుట్ అయ్యాయి. అలా ప్ర‌తీ సినిమాకు క‌లిసి రావాల‌ని లేదు. కానీ ద‌ర్శ‌క నిర్మాత‌లు అది జ‌రుగుతుంద‌ని న‌మ్ముతున్నారు. అస‌లే ఈ మ‌ధ్య తెలుగులో రాజ‌కీయాలు క‌లిసొస్తున్నాయి. మొన్న‌టికి మొన్న భ‌ర‌త్ అనే నేనులో మ‌హేశ్ ముఖ్య‌మంత్రిగా న‌టించాడు. అది ఇంకా మ‌రిచిపోనే లేదు అప్పుడే విజ‌య్ కూడా వ‌చ్చేసాడు. ఈయ‌న కూడా ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్నాడు. నోటాలో ఈయ‌న పాత్ర సిఎం. అది కూడా భాద్య‌తాయుత ముఖ్య‌మంత్రి కాదు.. కేర్ లెస్ సిఎం అన్న‌మాట‌. సినిమా అంతా ఇదే పాత్ర‌లో ఉండ‌బోతున్నాడు.

VD NOTA

ఇంత బ‌రువైన పాత్ర ఎలా పోషించి ఉంటాడో అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. ఏదైనా నా యిష్టం అనుకునే ముఖ్య‌మంత్రి పాత్ర ఇది. ఏం తెలియ‌కుండా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. అక్క‌డ సంచ‌ల‌నాలు సృష్టించే పాత్ర‌లో న‌టిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాతోనే త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్తున్నాడు విజ‌య్.

ఎప్ప‌ట్లాగే త‌న ఆటిట్యూడ్ కు త‌గ్గ‌ట్లుగా బూతుల‌తో పాటు ముద్దులు కూడా కురిపించాడు విజ‌య్. సిఎం పాత్ర అంటేనే ఏదో తెలియ‌ని ర‌చ్చ ఉంటుంది. ఇప్పుడు విజ‌య్ కూడా మ‌రోసారి ఇదే చేస్తున్నాడు. పైగా ముద్దులు.. బూతులతో మ‌రోసారి అర్జున్ రెడ్డిని గుర్తు చేసాడు విజ‌య్. దాంతో నోటాపై అంచ‌నాలు ఆకాశానికి చేరిపోయాయి. అక్టోబ‌ర్ 4న సినిమా విడుద‌ల కానుంది. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో నాజ‌ర్, స‌త్య‌రాజ్, మెహ్రీన్ న‌టిస్తున్నారు. బై లింగువ‌ల్ సినిమాగా నోటా తెర‌కెక్కుతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నాడో.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here