నోటా.. కుర్రాడు కుమ్మేస్తున్నాడు బాబోయ్..

అవును.. ఇప్పుడు విజ‌య్ దేర‌వ‌కొండ‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అస‌లు ఈయ‌న దూకుడు చూస్తుంటే మ‌తులు పోవ‌డం ఖాయం. అంత‌గా రెచ్చిపోతున్నాడు విజ‌య్. ఎక్క‌డికి వెళ్తే అలా మారిపోతున్నాడు. అర్జున్ రెడ్డి చేస్తున్న‌పుడు కుర్రాళ్ల‌ను త‌న‌తో పాటే అర్జున్ రెడ్డిలా మార్చేసాడు ఈ హీరో. ఇక గీతగోవిందం అప్పుడు అలా మాట్లాడాడు. ఇప్పుడు ఈయ‌న నోటా చేస్తున్నాడు కాబ‌ట్టి ఇప్పుడు కూడా ఇలాగే మారిపోతున్నాడు.

రాజ‌కీయ నాయ‌కుడిగా ప్ర‌సంగాలు దంచేస్తున్నాడు. అవ‌స‌రం అయిన చోట అద్భుతంగా త‌న నోట నోటా గురించి చెబుతున్నాడు. ఇప్పుడు కానీ నోటా హిట్టైందంటే అస‌లు మ‌నోన్ని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు. సాధార‌ణంగా బై లింగువ‌ల్ సినిమాలపై అంతగా భారీ అంచ‌నాలుండ‌వు కానీ విజయ్ నోటాపై మాత్రం భారీ అంచ‌నాలున్నాయి.

vijay deverakonda nota release date

ద్విభాషా చిత్రం అయినా కూడా ఇప్పుడు ఈ చిత్రం కోసం అటు ఇటు ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. అన్నింటికీ మించి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ కావ‌డం ఈ సినిమాకు క‌లిసొచ్చే అంశం. దానికితోడు త‌న మార్క్ ప్ర‌మోష‌న్స్ చేసుకుంటున్నాడు విజయ్. ఈ సినిమా అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఆ లోపు ప్ర‌మోష‌న్స్ ప్ర‌మోష‌న్స్ అంటూ దంచేస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు త‌న దృష్టి అంతా దానిపైనే ఉంది కూడా.

నోటా త‌ర్వాతే ఇంకేదైనా బుర్ర‌లో పెట్టుకునేలా ఉన్నాడు ఈ హీరో. అందుకే అన్నీ మైండ్ లోంచి తీసేసి ఈ ఒక్క‌టి పెట్టుకున్నాడు. నోటా త‌మిళ‌నాట కూడా భారీగా విడుద‌ల కానుంది. క‌చ్చితంగా ఇది వ‌చ్చిన త‌ర్వాత విజ‌య్ మ‌ళ్లీ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోవ‌డం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *