మ‌ళ్లీ క్లాస్ పీకిన విజ‌య్ దేవ‌ర‌కొండ..

విజ‌య్ దేవ‌ర‌కొండ స్పీచ్ అంటే మ‌స్త్ ఎంజాయ్ మెంట్ ఉంటుంది. ఎందుకంటే పిల్ల‌గాడు ప‌క్కా తెలంగాణ యాస‌లో చెప్పే కొన్ని మాట‌లు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తాయి. ఇదివ‌ర‌కే ప్ర‌తీసారి స్టేజ్ మీద త‌నదైన స్పీచ్ తో అల్లాడించే విజ‌య్.. ఇప్పుడు టాక్సీవాలా స‌క్సెస్ మీట్ లో కూడా మాట‌ల తూటాలు పేల్చాడు. మ‌ర్యాద‌గా మాట్లాడుతూనే మంట పెట్టాడు. ఎవ‌రికి అయితే తాను వార్నింగ్ ఇవ్వాల‌నుకున్నాడో ఇచ్చేసాడు.

Vijay devarakonda Mass Speech Abot taxiwala success

సింపుల్ గా చెప్పాలంటే పొమ్మ‌న‌కుండా పొగ‌బెట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పైర‌సీ చేసే వాళ్ల‌ను చూసే వాళ్ల‌ను అయితే తిట్ట‌నుపోరా అన్న‌ట్లు తీసిపారేసాడు. వాళ్ల‌కి మిడిల్ ఫింగ‌ర్ చూపించ‌మ‌ని అభిమానుల‌కు చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇప్పుడు చూపించినందుకు సారీ చెప్పాడు. ఒకేసారి అన్ని ఫింగ‌ర్స్ చూసి మీకు కూడా ఫ్యూజులు ఎగిగిపోయుంటాయ్ భ‌య్యో అంటూ కామెడీ కూడా చేసాడు. అంతేకాదు.. చ‌చ్చిన సినిమాను మ‌ళ్లీ ప్రాణం పోసి నిల‌బెట్టినందుకు థ్యాంక్స్ చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ.

తెలంగాణ‌లోనే కాదు.. ఏపీలో కూడా ఇప్పుడు బాక్సాఫీస్ కొత్త మొగుడుగా మారిపోయాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. డియ‌ర్ కామ్రేడ్ కూడా ఎలాంటి ఫ‌లితాన్ని ఇవ్వ‌బోతుందో..? ఈ సినిమా రావ‌డానికి మ‌రో ఆర్నెళ్లైనా ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కు టాక్సీవాలాను చూసుకోవాల‌ని చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here