త‌మిళ‌నాట విజ‌య్ వ‌ర్సెస్ విజ‌య్..

ఇక్క‌డ విజ‌య్ అంటే త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ కాదు. మ‌న హీరోనే.. ముద్దుల విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న నోటా సినిమాతో త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్తున్నాడు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి క్లీన్ యూ స‌ర్టిఫికేట్ ఇచ్చారు.

Vijay devarakonda In Tamil Movie

 

ఇదిలా ఉంటే ఈ సినిమాకు పోటీగా త‌మిళ‌నాట మ‌రో సినిమా వ‌స్తుంది. అది 96. ఇందులో కూడా విజ‌య్ హీరోగా న‌టించ‌డం విశేషం. అయితే అక్క‌డ దేవ‌ర‌కొండ అయితే ఇక్క‌డ సేతుప‌తి. మ‌క్క‌ల్ సెల్వ‌న్ గా త‌మిళ‌నాట స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజ‌య్ సేతుప‌తి.. అక్టోబ‌ర్ 4న 96 సినిమాతో వ‌స్తున్నాడు.

ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. 90ల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. త్రిష హీరోయిన్. ఇప్పుడు ఈ చిత్రానికి పోటీగా విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌స్తున్నాడు. ఈయ‌న నోటాపై కూడా భారీ అంచ‌నాలున్నాయి. పైగా గీత‌గోవిందం తెలుగు వ‌ర్ష‌న్ కూడా చెన్నైలో 6 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ లెక్క‌న నోటాకు కూడా భారీ ఓపెనింగ్స్ ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ చిత్రంతోనే త‌మిళ్ ప్రేక్ష‌కుల‌కు నేరుగా ప‌రిచ‌యం అవుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పైగా పొలిటిక‌ల్ ఎంటర్ టైన‌ర్ కావడంతో నోటా కోసం చూస్తున్నారు ప్రేక్ష‌కులు. మ‌రి ఈ రెండు సినిమాలు.. ఇద్ద‌రు విజ‌య్ ల‌లో ఎవ‌రు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌వ‌ర్ చూపిస్తారో చూడాలిక‌..!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *