విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. న‌లుగురితో నారాయ‌ణ‌..

గుంపులో ఉన్న‌పుడు క‌చ్చితంగా ఆ ప‌ది మంది చేసే ప‌ని తాము కూడా చేయాల్సి వ‌స్తుంది. అందుకే న‌లుగురితో నారాయ‌ణ అంటారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న కూడా ఇప్పుడు హీరో నుంచి నిర్మాత‌గా మారిపోయాడు. ఇక నుంచి త‌న సినిమాల‌ను త‌నే నిర్మించ‌బోతున్నాడు ఈ హీరో. అంటే ప్ర‌తీ సినిమా కాదు.. మ‌న‌సుకు న‌చ్చిన సినిమాల‌కు విజ‌య్ కూడా భాగ‌స్వామిగా ఉంటాడు.

VIJAY DEVARAKONDA NEW PRODUCTION

ఇప్పుడు నోటా లోనూ విజ‌య్ భాగ‌స్వామిగా ఉన్నాడు. ఇందులో రెమ్యునరేష‌న్ కు బ‌దులుగా పేరు తీసుకుంటున్నాడు. మ‌హేశ్ బాబు.. రామ్ చ‌ర‌ణ్.. నాగ‌శౌర్య‌.. క‌ళ్యాణ్ రామ్.. సుధీర్ బాబు.. ఇలా ఒక్క‌రేంటి ఇప్పుడు హీరోలంతా సొంతంగా నిర్మాణ సంస్థ‌లు పెట్టుకున్నారు.

వాళ్లు అందులోనే సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఇప్పుడు విజ‌య్ దేర‌వ‌కొండ కూడా ఇదే చేయ‌బోతున్నాడు. త‌న ప్రొడ‌క్ష‌న్ హౌజ్ కు కింగ్ ఆఫ్ ది హిల్ అని పేరు పెట్టుకున్నాడు విజ‌య్. ఇందులో సినిమాలు చేస్తాన‌ని చెప్పాడు కూడా. ప‌నిలో ప‌నిగా త‌న త‌మ్మున్ని కూడా ప‌రిచ‌యం చేసే బాధ్య‌త త‌నే తీసుకోవాల‌ని చూస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టికే తెలుగులో చాలా మంది హీరోలు నిర్మాత‌లుగానూ స‌త్తా చూపిస్తున్నారు. కానీ రెండు ప‌డ‌వ‌ల జ‌ర్నీ ఎప్పుడూ డేంజ‌రే. మరి ఈ విష‌యంలో విజ‌య్ దేర‌వ‌కొండ ప్ర‌యాణం ఎలా ఉండ‌బోతుందో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *