ఎన్టీఆర్ తో నాకు పోటీ ఏంటి అంటున్న విజ‌య్.

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న సినిమా హిట్టైతే 100 కోట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని గీత‌గోవిందం చూపించింది. ఇలాంటి టైమ్ లో ఈయ‌న నుంచి వ‌స్తున్న సినిమా నోటా. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఇక ఇప్పుడు ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వారం రోజుల గ్యాప్ లోనే ఎన్టీఆర్ అర‌వింద స‌మేత వ‌స్తుంది క‌దా.. ఎలా భావిస్తున్నారు.. ఎన్టీఆర్ తో పోటీ ఎలా ఉండ‌బోతుంది అనే ప్ర‌శ్న విజ‌య్ కు వ‌చ్చింది.

VIJAY-DEVARAKONDA-VS-NTR

ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో త‌న సినిమాకు పోటీ ఏంట‌ని ప్ర‌శ్నించాడు విజ‌య్. అస‌లు అర‌వింద స‌మేత సినిమాకు ఓ వారం ముందు విడుద‌ల చేయ‌డం త‌న సినిమాకు రిస్క్ అని.. అది తెలిసి కూడా వ‌స్తున్నానని చెప్పాడు ఈ హీరో. ఈ విషయంలో భయపడి వెనక్కి తగ్గాల్సింది తామే అని నిజం ఒప్పుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. క‌థ‌పై న‌మ్మ‌కంతో ముందుకు వ‌చ్చేసాం అని చెబుతున్నాడు ఈ హీరో.

అయితే మీ సినిమా రిలీజ్ చేయొద్దు అని చెప్పే హ‌క్కు మాత్రం ఇక్క‌డ ఎవ‌రికీ లేద‌ని.. ఇక ఎన్టీఆర్ సినిమాతో పోటీ అనేది చాలా త‌ప్పు అని.. ఆయ‌న సినిమా కంటే త‌న సినిమా ప‌ది రెట్లు త‌క్కువగా ఉంటుంద‌ని అలాంటపుడు వార్ వ‌న్ సైడ్ అవుతుంద‌ని చెప్పాడు విజ‌య్. నిజానికి తన సినిమాను దసరా సెలవుల్లో విడుద‌ల చేయాల‌నుకున్నా కూడా అనుకోని కార‌ణాలు నోటాను ముందుకు తీసుకొచ్చాయ‌ని చెప్పాడు విజ‌య్. ఇందులో దిల్ రాజు కూడా ఉన్నాడు. ద‌స‌రాకు ఆయ‌న హ‌లో గురు ప్రేమ‌కోసమే ఉంది. దాంతో ఈ సినిమాను త‌ప్పించ‌డానికి నోటాను ముందు విడుద‌ల చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ తో త‌న‌కు పోటీ అనేది పెద్ద బూతు అని.. త‌ను ఎప్ప‌టికీ ఎన్టీఆర్ కు పోటీ కాలేన‌ని చెప్పాడు ఈ కుర్ర హీరో. అక్టోబ‌ర్ 5న నోటాతో వ‌స్తున్నాడు విజ‌య్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *