న‌య‌న‌తార వైఫ్ ఆఫ్ విఘ్నేష్ శివ‌న్.

అవునా.. ఎప్పుడు జ‌రిగింది ఈ వింత‌.. నిజంగానే న‌య‌న‌తార‌కు పెళ్లైపోయిందా.. మ‌రి ఎందుకు చెప్ప‌డం లేదు అనుకుంటున్నారా..? ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం అయితే న‌య‌న‌తార‌కు ఎప్పుడో పెళ్లైపోయింది. విఘ్నేష్ శివ‌న్ నే ఈమె త‌న‌వాన్ని చేసుకుంది. అయితే బ‌య‌టికి మాత్రం చెప్ప‌డం లేదు. న‌య‌న్ జాతకం ప్ర‌కారం పెళ్లి జ‌రిగిన‌ట్లు తెలిస్తే విడిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఎవ‌రో చెప్పార‌ని తెలుస్తుంది.

vignesh-shivan-gives-surprise-for-nayanthara

పైగా హీరోయిన్ కు పెళ్లి అయింద‌ని తెలిస్తే అవ‌కాశాలు కూడా రావు. అందుకే సీక్రేట్ గా స‌హ‌జీవ‌నం చేస్తున్నారు ఈ జంట‌. ఇక ఇదిలా ఉంటే విఘ్నేష్ తో త‌న ప్రేమ వ్య‌వ‌హారం మాత్రం ఏం దాచుకోవ‌డం లేదు. అన్నీ ఆయ‌నే అన్న‌ట్లు ఉంటుంది. ఎన్నాళ్లూ ఇంకా ఈ ముసుగులో గుద్దులాట‌.. బ‌య‌టికి ఎప్పుడైనా తెలిసేదే క‌దా..? ఇంకెందుకు దాచుకోవ‌డం.. దాచుకున్నా దాగుతుందా ఏంటి ఇప్పుడు వ్య‌వ‌హారం అన్న‌ట్లుంది న‌య‌న‌తార తీరు చూస్తుంటే. ఈమె ఇప్పుడు ఏమీ దాచుకోవ‌డం లేదు. ముఖ్యంగా ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాల‌న్నీ బ‌య‌టికి చెప్పేస్తుంది న‌య‌న‌తార‌.

విఘ్నేష్ శివ‌న్ గురించి ఎప్పుడు అడిగినా స్నేహితుల‌మే అంటూ త‌ప్పించుకునే న‌య‌న్.. ఇప్పుడు మాత్రం ఓపెన్ గా త‌నే కాబోయే భ‌ర్త అని చెబుతుంది. కాక‌పోతే అంతా మాత్రం అయిన భ‌ర్త అంటున్నారు. ఆ మ‌ధ్యే ది హిందూ వ‌ర‌ల్డ్ ఆఫ్ ఉమెన్ కార్య‌క్ర‌మంలో అవార్డు తీసుకుంటూ విఘ్నేష్ గురించి ఓపెన్ అయింది న‌య‌న్. అవార్డ్ తీసుకున్న సంతోషంలో పేరెంట్స్.. బ్ర‌ద‌ర్ తో పాటు త‌న‌కు కాబోయే భ‌ర్త అంటూ విఘ్నేష్ ను ఉద్దేశించి చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ స్టేట్ మెంట్ తో తమ బంధాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పింది న‌య‌న‌తార‌.

కొంత‌కాలంగా ప్రియుడితోనే క‌లిసి ఉంది న‌య‌న‌తార‌. ఓ వైపు సినిమాలు చేస్తున్నా కూడా ఎప్ప‌టికప్పుడు స‌మ‌యం దొరికిన ప్ర‌తీసారి విఘ్నేష్ తో క‌లిసి విదేశీ ట్రిప్పులకు వెళ్తూనే ఉంది. న‌య‌న‌తార‌కు ప్రేమ వీక్ నెస్. ప్ర‌భుదేవా.. శింబుతో ప్రేమ విఫ‌లం అయ్యాక ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో ఉంది. ఈ ద‌ర్శ‌కుడితో మూడేళ్లుగా పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగింది న‌య‌న‌తార. పెళ్లి అంటే ఎక్క‌డ త‌మ బంధం తెగిపోతుందో అని సింపుల్ గా ప్రేమ‌లోనే ఉన్నారు ఈ జంట‌. మ‌రోవైపు మాత్రం వీళ్లు ఆల్రెడీ అదే బంధంలో ఉన్నారంటున్నారు. మ‌రి ఏది నిజ‌మైనా కూడా ప్ర‌స్తుతానికి వాళ్లిద్ద‌రూ చాలా హ్యాపీగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here