వెంక‌టేష్ తో ఆ ద‌ర్శ‌కుడు సెట్ అవుతాడా..?

ఎఫ్ 2తో బిజీగా ఉన్నా కూడా మ‌రో మూడు సినిమాల‌ను లైన్ లో పెట్టేసాడు వెంక‌టేష్. అస‌లు ఈయ‌న జోరు చూస్తుంటే షాక్ అవుతున్నారంతా. ఉన్న‌ట్లుండి అంత‌గా స్పీడ్ పెంచేసాడు విక్ట‌రీ హీరో. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌న త్రినాథ‌రావ్ సినిమాను దాదాపు క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ఎఫ్ 2 షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది.

venkatesh movie with trinadha rao direction

ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ తో క‌లిసి న‌టిస్తున్నాడు వెంక‌టేశ్. ఇదిలా ఉంటే న‌వంబ‌ర్ నుంచి నాగ‌చైత‌న్య‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు వెంకీ. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 12 నుంచి మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది. వెంకీ మామా టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో నిజంగానే మామ అల్లుళ్లుగా న‌టించ‌బోతున్నారు వెంక‌టేశ్, చైతూ.

ఇక త్రినాథ‌రావ్ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించ‌బోతున్నాడు వెంకీ. ఖాకీ చొక్కా వెంకీకి అస్స‌లు క‌లిసిరాలేదు. అయినా కూడా మ‌రోసారి ఇదే చేస్తున్నాడు వెంక‌టేష్. సూర్య ఐపిఎల్, సూప‌ర్ పోలీస్, ఘ‌ర్ష‌ణ‌, బాబు బంగారం ఇలా ఏ సినిమాలోనూ వెంకీకి ఖాకీ క‌లిసిరాలేదు. అయినా కూడా మ‌రోసారి ఇదే పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు వెంక‌టేష్. ప్ర‌స‌న్న కుమార్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో వెంకీ ముంద‌డుగేస్తున్నాడు. దాంతోపాటు రానాతోనూ ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తాడ‌ని సురేష్ బాబు క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే వెంకీ అట్లూరితో కూడా సినిమాలు చేయ‌బోతున్నాడు వెంక‌టేశ్. ఇలా ఒకేసారి నాలుగు సినిమాలు క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఇవ‌న్నీ వ‌చ్చే రెండేళ్ల‌లో పూర్తి చేయ‌డానికి చూస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here