వ‌రుణ్ తేజ్.. మెగా తేజ్ ఎక్స్ ప్రెస్..

ఇండ‌స్ట్రీలో ఎవ‌రి టైమ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌లేం. ఏడాది కింది వ‌ర‌కు సాయిధ‌రంతేజ్ స్టార్ అవుతాడు.. వ‌రుణ్ తేజ్ మాత్రం రానాలా అన్ని పాత్ర‌లు చేసుకోవాల్సిందే అని జోస్యం చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. ఒక్క హిట్ అంటూ సాయి ఎదురుచూస్తుంటే.. వ‌రుణ్ తేజ్ మాత్రం వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకెళ్తున్నాడు. ఫిదా.. వెంట‌నే తొలిప్రేమ విజ‌యాలు సాధించ‌డంతో వ‌రుణ్ తేజ్ కెరీర్ ఇప్పుడు టాప్ స్పీడ్ లో ఉంది.

Varun tej telugu latest movies

మీడియం బ‌డ్జెట్ సినిమాల‌కు ఇప్పుడు వ‌రుణ్ తేజ్ ప‌ర్ ఫెక్ట్ ఛాయిస్ అయ్యాడు. దాంతో నిర్మాత‌లు ఇత‌డి కోసం క్యూ క‌డుతున్నారు. ఈ ఇప్ప‌టికే ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డితో చేస్తున్న అంత‌రిక్షం షూటింగ్ పూర్త‌యింది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది ఈ చిత్రం. 25 కోట్ల‌తో క్రిష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌టం విశేషం.

ఈ సినిమాతో పాటే ఇప్పుడు అనిల్ రావిపూడి ఎఫ్ 2తో బిజీగా ఉన్నాడు వ‌రుణ్ తేజ్. ఈ చిత్ర షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. దిల్ రాజు నిర్మాత‌. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో వెంక‌టేశ్ కూడా న‌టిస్తున్నాడు. ఎఫ్ 2 త‌ర్వాత సాగ‌ర్ చంద్ర‌తో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు వ‌రుణ్ తేజ్. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతుంది. ఇక ఈ చిత్రంతో పాటే ఇప్పుడు అల్లు అర‌వింద్ కూడా వ‌రుణ్ తేజ్ తో సినిమా అనౌన్స్ చేసాడు. దాంతోపాటు త్రినాథ‌రావ్ న‌క్కిన‌తోనూ వ‌రుణ్ తేజ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

ఇది దిల్ రాజు బ్యాన‌ర్ లో ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు ఐదు సినిమాల‌తో వ‌స్తున్నాడు ఈ మెగా వార‌సుడు. ముందు కాస్త స్లోగా కెరీర్ మొద‌లుపెట్టినా ఇప్పుడు సూప‌ర్ ఫాస్ట్ గా వ‌చ్చేస్తున్నాడు ఈ హీరో. మ‌రి ఇందులో ఏది ఈ కుర్ర హీరో కెరీర్ కు ఊపిరి ఊదుతుంది అనేది చూసుకోవాలి క‌దా. లేదంటే ఎన్ని సినిమాలు చేసినా కూడా సాయిధ‌రంతేజ్ లా ఎటూ కాకుండా ఖాళీగా మిగిలిపోక త‌ప్ప‌దు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here