వ‌ర్మ మ‌ళ్లీ తెలుగులో రిలీజ్ ఏంది రాజా..?

ఇది పిచ్చికి పీక్స్ ఇంక‌. అస‌లు మాట‌లు కూడా లేవు. ఏమ‌నాలో కూడా అర్థం కాని ప‌రిస్థితి. మ‌న సినిమాను తీసుకెళ్లి.. అక్క‌డ రీమేక్ చేసుకుని మ‌ళ్లీ మ‌న‌కు డ‌బ్బింగ్ వ‌ర్ష‌న్ రిలీజ్ చేయ‌డం అనేది అంత‌కంటే కామెడీ మ‌రోటి ఉండ‌దు. ఇప్పుడు వ‌ర్మ సినిమా విష‌యంలో ఇదే జ‌రుగుతుంది.

varma

అర్జున్ రెడ్డి రీమేక్ గా ఈ సినిమాను తెర‌కెక్కించాడు బాల‌. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అర‌వోళ్లు అర్జున్ రెడ్డి చూడ‌లేదు కాబ‌ట్టి విక్ర‌మ్ త‌న‌యుడు ఉన్నాడ‌నే ధ్యాస‌లో చూస్తారేమో.. పైగా విష‌యం ఉన్న సినిమా కాబ‌ట్టి అక్క‌డ ఆడినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. అయితే అర్జున్ రెడ్డి సినిమాను చెడ‌గొట్టేసారంటూ టీజ‌ర్ చూసి విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.
ఇలాంటి టైమ్ లో ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు.

ఇది కామెడీకి పీక్స్ అస‌లు.. లేక‌పోతే మ‌రేంటి.. చ‌రిత్ర సృష్టించిన అర్జున్ రెడ్డిని మ‌ళ్లీ మ‌న‌కు డ‌బ్బింగ్ రూపంలో చూపిస్తే ప్రేక్ష‌కులు ఊరుకుంటారా..? అస‌లు విజ‌య్ స్థానంలో మ‌రో హీరోను క‌నీసం వాళ్లు ఊహించుకుంటారా..? అప్ప‌ట్లో అర్జున్ కానీ న‌రసింహన‌యుడు రీమేక్ చేసి.. మ‌ళ్లీ మ‌న‌కే సింహ‌బ‌లుడు అంటూ విడుద‌ల చేసాడు కదా అలా ఉంటుంది ఇప్పుడు అర్జున్ రెడ్డిని కానీ రీమేక్ చేసి మ‌ళ్లీ డ‌బ్బింగ్ చేస్తే. ఏమో చూడాలిక‌.. బాల క్రేజ్.. విక్ర‌మ్ త‌న‌యుడి తొలి సినిమా అని ప్ర‌మోట్ చేస్తూ ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. మ‌రి ఏం అవుతుందో చివ‌రికి..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *