ఎన్టీఆర్ కు పెద్ద‌న్న‌య్య దొరికాడు..

జాన‌కిరామ్ క‌న్ను మూసిన త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ తోనే అన్నీ షేర్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇక ఆ త‌ర్వాత హ‌రికృష్ణ కూడా మ‌ర‌ణించ‌డంతో ఎన్టీఆర్ ఒక్క‌సారిగా ఒంట‌రి వాడైపోయిన‌ట్లు అనిపించింది. అయితే ఇప్పుడు ఈయ‌న‌కు మ‌రో పెద్ద‌న్న‌య్య దొరికాడు. ఆయ‌నే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ప్రీ రిలీజ్ వేడుక‌లో ఎన్టీఆర్ ఇదే మాట‌లు చెప్పి క‌ళ్లు తుడుచుకున్నాడు. ద‌ర్శ‌కుడు హీరో అనేది భార్యాభ‌ర్త‌ల బంధంలా ఉండాలి.

Trivikram Is my Bonding Jrntr Said in Aravinda Sametha Event

అక్క‌డ ఒక‌ర్నొక‌రు అర్థం చేసుకుంటే కాపురం సాఫీగా సాగిపోతుంది.. ఇక్క‌డ వీళ్లు అర్థం చేసుకుంటే సినిమా అందంగా వ‌స్తుంది. త్రివిక్ర‌మ్ కూడా ఇప్పుడు చేస్తుందిదే. ఈయ‌న ఎన్టీఆర్ ను బాగా అర్థం చేసుకున్నాడు. ఒక్క మాట కూడా తేడా రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. అర‌వింద స‌మేత మొద‌లైన కొత్త‌లో కొన్ని విభేధాలు వ‌చ్చాయ‌నే వార్త‌లు వ‌చ్చాయి. షూటింగ్ జ‌రుగుతున్న తీరుపై ఎన్టీఆర్ ఆస‌క్తిగా లేడ‌నే వార్త‌లు కూడా వినిపించాయి. అయితే త‌ర్వాత త‌ర్వాత త్రివిక్ర‌మ్ దాన్ని క‌వ‌ర్ చేస్తూ వ‌చ్చాడు.
ఇక ఇప్పుడు పూర్తిగా అర‌వింద స‌మేత‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నాడు యంగ్ టైగ‌ర్.

ఇలాంటి టైమ్ లో ఆయ‌న తండ్రి చ‌నిపోవ‌డం అనూహ్యం. దాంతో మ‌ళ్లీ ఒక్క‌సారిగా ఎన్టీఆర్ షాక్ లోకి వెళ్లిపోయాడు. అందుకే ఈ క‌ష్ట స‌మ‌యంలో అర‌వింద స‌మేత టీం అంతా ఎన్టీఆర్ స‌మేతంగా మారిపోయారు. ఆయ‌న ఎప్పుడు కావాలంటే అప్పుడు షూటింగ్ కు వ‌చ్చేలా గ‌త నెల రోజులుగా ఆయ‌న్ని కంటికి రెప్ప‌లా చూసుకున్నారు. షూటింగ్ కూడా ఆయ‌న ఇంటికి ద‌గ్గ‌ర్లోనే పెట్టాడు త్రివిక్ర‌మ్. చేసే మూడ్ ఉంటే చేసి ఆపేసి ఎలాగోలా అనుకున్న టైమ్ కు షూటింగ్ పూర్తి చేసాడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న ఎమోష‌న‌ల్ స్టేట‌స్ కు క‌చ్చితంగా ఇంటి వాళ్లతో కూడా క‌లిసుండాలి. అందుకే షూటింగ్ కూడా త్వ‌ర‌గా పూర్తి చేసాడు త్రివిక్ర‌మ్. ఒక్క‌సారి ప్యాక‌ప్ చెప్పిన త‌ర్వాత ఎన్టీఆర్ ను పూర్తిగా వ‌దిలేసాడు. మొత్తానికి ఎన్టీఆర్ కు నిజంగానే ఓ అన్న‌లా అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు మాట‌ల మాంత్రికుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *