సంక్రాంతి పందేలు.. ర‌జినీకాంత్ వ‌స్తున్నాడు..

సంక్రాంతి టార్గెట్ ఇది అని చాలా రోజులుగా మ‌న హీరోలు ఖ‌ర్చీఫ్ వేసుకుని కూర్చుంటారు కానీ అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌డానికి అది సినిమా కాదు క‌దా. అందుకే ఇప్పుడు సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోలు అనుకుంటే రెండు మాత్ర‌మే వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి.

ntrbiopicandRc12

ఎన్టీఆర్ బ‌యోపిక్ అనుకున్న టైమ్ కు అనుకున్న విధంగా రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ అనుకున్న‌ట్లుగా జ‌రుగుతుంది. ఎక్క‌డా డిలే కాకుండా అనుకున్న టైమ్ కు షూట్ పూర్తి చేస్తున్నాడు క్రిష్. జ‌న‌వ‌రి 9న తొలిభాగం.. 24న రెండో భాగం విడుద‌ల కానున్నాయి. ఇప్ప‌టికే క్రిష్-బాల‌య్య కాంబినేష‌న్ శాత‌క‌ర్ణిని 2017 సంక్రాంతికి విడుద‌ల చేసి స‌క్సెస్ అందుకున్నారు. ఇప్పుడు కూడా ఇదే చేయాల‌ని చూస్తున్నారు. జ‌న‌వ‌రి 9న ఎన్టీఆర్ వ‌స్తుంటే 11న రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి విన‌య విధేయా రామ రానుంది.

ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంద‌నే వార్త‌లు వినిపించినా కూడా త‌మ సినిమా వ‌చ్చేది సంక్రాంతికే అని మ‌రోసారి క‌న్ఫ‌ర్మ్ చేసాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను. డిసెంబ‌ర్ నాటికి టాకీ పూర్తి చేసి.. ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీ కానున్నారు చిత్ర‌యూనిట్. సంక్రాంతికి సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే నాయ‌క్.. ఎవ‌డు లాంటి విజ‌యాలు సంక్రాంతికి అందుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఇక చ‌ర‌ణ్, బాల‌య్య‌తో పాటు వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ ఎఫ్ 2 కూడా ఇదే పండ‌క్కి రాబోతుంది. ఈ మేర‌కు దిల్ రాజు అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు.

జ‌న‌వ‌రి 12న అనిల్ రావిపూడి ఎఫ్ 2 విడుద‌ల కానుంద‌ని చెప్పాడు రాజు. ఇక ఇప్పుడు ర‌జినీకాంత్ కూడా సంక్రాంతి పండ‌క్కే వ‌స్తున్నాడు. ఈయ‌న పేట్ట అదే పండ‌క్కి వ‌స్తుంది. చూస్తుంటే సంక్రాంతి 2019 చాలా రంజుగా జ‌రిగేలా క‌నిపిస్తుంది. ఎవ‌రు గెలుస్తారో తెలియ‌దు కానీ పోటీ మాత్రం ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌డం మాత్రం ఖాయం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *