త‌మ‌న్నా ఆటిట్యూడ్ తో లేనిపోని త‌ల‌నొప్పులు..

త‌మ‌న్నా నిజంగానే అంత ఆటిట్యూడ్ చూపిస్తుందా..? త‌మ‌న్నాను చూస్తుంటే ప్రెస్ తో పాటు మీడియాకు కూడా కోపాలు వ‌స్తున్నాయా..? ఏమో ఇప్పుడు ఆమె వైఖ‌రి చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది మ‌రి. ఎందుకంటే మొన్నీమ‌ధ్యే నెక్ట్స్ ఏంటి ప్రెస్ మీట్ స‌మ‌యంలో త‌మ‌న్నా చూపించిన ఆటిట్యూడ్ అక్క‌డున్న మీడియా వారంద‌రికి కోపం తెప్పించింద‌ని తెలుస్తుంది. ఆ రోజు మిల్కీబ్యూటీ చేసిన ప‌నుల‌తో విసుగెత్తిపోయింది మీడియా వ‌ర్గం.

Tollywood Media Irritating Milky beauty

చెప్పిన టైమ్ కు రాకుండా.. క‌నీసం రెస్పాన్స్ ఇవ్వ‌కుండా చుక్క‌లు చూపించింద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ప్రెస్ మీట్ అంటే తీరిగ్గా 3.20కి వ‌చ్చింద‌ని.. అప్ప‌టి వ‌ర‌కు అడిగినా కూడా క‌నీసం స‌మాధానం కూడా ఇవ్వ‌కుండా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

చిన్న సినిమా కాబ‌ట్టి త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఆడుకుంటుంద‌ని ఆమెపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ కిష‌న్ 3.15కి ఇంట‌ర్వ్యూ అంటే అదే టైమ్ కు వ‌చ్చాడ‌ని.. కానీ ఎందుకో తెలియ‌దు త‌మ‌న్నా మాత్రం రెండు గంట‌లు ఆల‌స్యం రావ‌డ‌మే కాకుండా ఆ త‌ర్వాత కూడా స‌రిగ్గా రెస్పాన్స్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తుంది.

ఇప్పుడు ఈమె ఆటిట్యూడ్ చాలా ఇష్యూగా మారిపోయింది. నా వ‌ల్లే సినిమాలు ఆడేస్తున్నాయ‌నే పొగ‌రు ఇప్పుడు త‌మ‌న్నాలో క‌నిపిస్తుంద‌ని ఆమెను చాలా ద‌గ్గ‌ర్నుంచి చూసిన వాళ్లే చెబుతున్నారు. మొత్తానికి కెరీర్ చివ‌ర్లో కూడా ఇలాంటి ఆటిట్యూడ్ చూపిస్తే రేపు లేనిపోని త‌ల‌నొప్పులు రావ‌డం ఖాయం. మ‌రి ఇప్పుడు న‌టిస్తున్న ఎఫ్ 2.. సైరా లాంటి పెద్ద సినిమాల‌కు కూడా ఇలాంటి త‌ల‌నొప్పులే త‌మ్మూ చూపిస్తుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here