విజ‌య్-మురుగ‌దాస్ నాలుగో సినిమా.. బ్లాక్ బ‌స్ట‌ర్ ఆన్ ది వే..

తమిళనాట ఆ కాంబినేషన్ కలుస్తుంది అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఇప్పటికే మూడు సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఆ జోడి ఇప్పుడు మరోసారి కాబోతుంది. అభిమానులు అంతగా ఊరిస్తున్న ఆ కాంబినేషన్ విజయ్ -మురుగదాస్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. 2012లో తుపాకి సినిమాతో వీళ్లిద్దరి జర్నీ మొద‌లైంది. అప్పట్లో ఆ సినిమా సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. తుపాకీ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని కత్తి సినిమాతో వచ్చారు విజయ్-మురుగుదాస్. ఈ సినిమా కూడా తమిళనాట కొత్త చరిత్రకు తెర తీసింది.

Thuppakki 2 Movie Updates

100 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. రైతు సమస్యలతో తెరకెక్కిన ఈ సినిమాని చిరంజీవి తన రీ ఎంట్రీ కోసం వాడుకున్నాడు. ఇక ముచ్చటగా మూడోసారి సర్కార్ సినిమాతో వ‌చ్చి మ‌రో సంచలన విజయం అందుకున్నారు. ఎన్నో వివాదాలు మధ్య విడుదలైన సర్కార్ అన్ని దాటుకొని విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో నాలుగో సినిమా రాబోతుంది.

మురుగదాస్ ప్రస్తుతం రజనీకాంత్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది చివర్లో విజయ్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. ఇది తుపాకి సినిమాకు సీక్వెల్ అని చెప్పి అభిమానుల్లో అంచనాలు ఇంకా పెంచేశాడు ఈ దర్శకుడు. 2020 లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఆ లోపు విజ‌య్ కూడా అట్లీ కుమార్ తో తాను కమిట్ అయిన సినిమాను పూర్తి చేయనున్నాడు. తెరీ, మెర్సల్ సినిమాల తర్వాత అట్లీతో విజయ్ చేస్తున్న మూడో సినిమా ఇది. 130 కోట్ల జనాభా ఉన్న ఇండియాకు ఎందుకు ఒలంపిక్ పథకాలు రావడం లేదు.. క్రీడల్లో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి అని అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు అట్లీ కుమార్. ఈ సినిమా పూర్తయిన తర్వాత మురుగదాస్ తుపాకీ 2తో బిజీ కానున్నాడు విజయ్. మరి హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న విజయ్ మురుగదాస్ జోడి నాలుగోసారి ఎలాంటి సంచలనం సృష్టించబోతోందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here