దారుణంగా ముంచేస్తున్న థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్..

అమీర్ ఖాన్.. ఈ పేరంటేనే ఓ బ్రాండ్. ఈయ‌న ఏ సినిమా చేసినా కూడా అదో ట్రెండ్. ఎలా ఉంది అని అడ‌క్కుండానే ఆయ‌న సినిమాకు వెళ్లే ప్రేక్ష‌కులు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఈయ‌న చేసిన థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా చూసి ప్రేక్ష‌కులు తిట్టుకుంటున్నారు.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌సూళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. ఓపెనింగ్స్ ప‌రంగా మూడు రోజుల‌కు 100 కోట్లు వ‌సూలు చేసింది కానీ ఆ త‌ర్వాత మాత్రం ప‌రిస్థితి దారుణమే.

Thugs of hindostan disappointing

ఎందుకంటే ఈ సినిమా సేఫ్ కావాలంటే 400 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేయాలి. అమీర్ ఖాన్ ఉన్నాడు క‌దా అని ముందు వెన‌క చూడ‌కుండా కొనేసారు బ‌య్య‌ర్లు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అస‌లు ఇలాంటి క‌థ అమీర్ ఖాన్ ఎలా ఓకే చేసాడు అంటూ విమ‌ర్శిస్తున్నారు. అమీర్ ఖాన్ ఉన్నాడ‌ని వెళ్తే థియేట‌ర్స్ లో త‌ల బొప్పి గ‌ట్టించాడు క‌దా అంటూ ఫ్యాన్స్ కూడా ఏడుస్తున్నారు. గ‌త ప‌దేళ్ల‌లో ఇలాంటి చెత్త సినిమా ఆయ‌న నుంచి రాలేద‌ని వాపోతున్నారు అభిమానులు.

Thugs of Hindustan Collections
Thugs of Hindustan Collections

అప్పుడెప్పుడో 2005లో వ‌చ్చిన మంగ‌ళ్ పాండే త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ అమీర్ నుంచి అంత‌టి డిజాస్ట‌ర్ రాలేదు. అయితే ఇప్పుడు చెత్త సినిమా లిస్ట్ లో తాను కూడా ఉన్నానంటూ థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ వ‌చ్చేసింది. విజ‌య్ కృష్ణ ఆచార్య తెర‌కెక్కించిన ఈ చిత్రానికి టాక్ దారుణంగా వ‌చ్చింది. విజువ‌ల్స్ త‌ప్ప సినిమాలో ఏ మాత్రం విష‌యం లేద‌ని తేల్చేసారు ప్రేక్ష‌కులు. దివాళి సీజ‌న్ కాబ‌ట్టి ఓపెనింగ్స్ తో బ‌య‌ట‌ప‌డింది కానీ 500 కోట్లు తీసుకురావ‌డం మాత్రం క‌లే. అది చేయ‌క‌పోతే సినిమా బ‌లే. మ‌రి చూడాలిక‌.. ఈ టాక్ తో అమీర్ ఖాన్, అమితాబ్ బ‌చ్చ‌న్ క‌లిసి థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ ను ఎంత‌వ‌ర‌కు కాపాడ‌తారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here