అమీర్ ఖాన్ ను భ‌య‌పెడుతున్న బ‌య్య‌ర్లు..

aamir-khan

అమీర్ ఖాన్.. ఈ పేరంటేనే ఓ బ్రాండ్. ఈయ‌న ఏ సినిమా చేసినా కూడా అదో ట్రెండ్. ఎలా ఉంది అని అడ‌క్కుండానే ఆయ‌న సినిమాకు వెళ్లే ప్రేక్ష‌కులు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఈయ‌న చేసిన థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా చూసి ప్రేక్ష‌కులు తిట్టుకుంటున్నారు.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌సూళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. ఓపెనింగ్స్ ప‌రంగా మూడు రోజుల‌కు 100 కోట్లు వ‌సూలు చేసింది కానీ ఆ త‌ర్వాత మాత్రం ప‌రిస్థితి దారుణమే.

ఎందుకంటే ఈ సినిమా సేఫ్ కావాలంటే 400 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేయాలి. అమీర్ ఖాన్ ఉన్నాడు క‌దా అని ముందు వెన‌క చూడ‌కుండా కొనేసారు బ‌య్య‌ర్లు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అస‌లు ఇలాంటి క‌థ అమీర్ ఖాన్ ఎలా ఓకే చేసాడు అంటూ విమ‌ర్శిస్తున్నారు. అమీర్ ఖాన్ ఉన్నాడ‌ని వెళ్తే థియేట‌ర్స్ లో త‌ల బొప్పి గ‌ట్టించాడు క‌దా అంటూ ఫ్యాన్స్ కూడా ఏడుస్తున్నారు.

గ‌త ప‌దేళ్ల‌లో ఇలాంటి చెత్త సినిమా ఆయ‌న నుంచి రాలేద‌ని వాపోతున్నారు అభిమానులు. అప్పుడెప్పుడో 2005లో వ‌చ్చిన మంగ‌ళ్ పాండే త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ అమీర్ నుంచి అంత‌టి డిజాస్ట‌ర్ రాలేదు. అయితే ఇప్పుడు చెత్త సినిమా లిస్ట్ లో తాను కూడా ఉన్నానంటూ థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ వ‌చ్చేసింది. విజ‌య్ కృష్ణ ఆచార్య తెర‌కెక్కించిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 150 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేదు ఈ చిత్రం.

దాంతో థ‌గ్స్ ను న‌మ్మి అడ్డంగా మునిగిపోయారు బ‌య్య‌ర్లు. దాంతో ఇప్పుడు త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని వాళ్లు గొడ‌వ‌కు దిగుతున్నారు. ఒక‌టి రెండు అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఏకంగా 240 కోట్ల న‌ష్టాలు అంటే చిన్న విష‌యం కాదు. దాంతో ఇప్పుడు అమీర్ ఖాన్ కు ఏం చేయాలో కూడా అర్థం కావ‌డం లేదు. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ కు ఇలాంటి డిజాస్ట‌ర్ వ‌చ్చి చాలా ఏళ్లైపోయింది. మ‌రి చూడాలిక‌.. ఈ బంధిపోట్ల దెబ్బ‌ను అమీర్ ఎలా త‌ట్టుకుంటాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here