నేను నా కుటుంబం అంటున్న విన‌య విధేయ రామ‌.. 

మొన్న‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇప్ప‌ట్నుంచీ ఒక లెక్క‌. ఫ్యామిలీ సాంగ్ వ‌చ్చింద‌ని తెలుసుకోండి అంటున్నాడు రామ్ చ‌ర‌ణ్. టీజ‌ర్ చూసి ఇది ప‌క్కా మాస్ సినిమా.. ఇందులో అస‌లు ఎమోష‌న్స్ కానీ కామెడీ కానీ ఉండ‌దేమో అనుకున్న వాళ్ల‌కు ఇందులో ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా ఉన్నాయ‌ని నిరూపించుకునే ప‌నిలో ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను. ఎందుకంటే ముందు విడుద‌లైన టీజ‌ర్ చూసిన త‌ర్వాత విన‌య విధేయ రామ‌లో అస‌లు ఫైట్లు త‌ప్ప ఇంకేమైనా ఉన్నాయా అనే డౌట్స్ వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాత మెల్ల‌గా త‌న‌ను తాను మార్చుకుంటున్నాడు బోయ‌పాటి శీను. ఈ చిత్రంలో మాస్ ఒక్క‌టే కాదు ఇంకా చాలానే ఉన్నాయ‌ని చెప్ప‌డానికి శాయ‌శక్తుల ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.

మొన్న‌టికి మొన్న కార్తిక పౌర్ణ‌మి స్పెష‌ల్ అంటూ దండం పెడుతున్న క్లాస్ ఫోటో విడుద‌ల చేసిన టీం.. ఇప్పుడు ఏకంగా ఓ పాట‌నే తీసుకొచ్చాడు. ఇందులో కుటుంబం మొత్తంతో క‌లిసి పాట పాడుకుంటున్న రాముడు క‌నిపిస్తున్నాడు. తందానే తందానే.. ఎక్క‌డైనా చూసారా ఇంతానందాన్నే అంటూ శ్రీ‌మ‌ణి రాసిన పాట‌ను ఎమ్ఎల్ఆర్ కార్తికేయ‌న్ పాడాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాట‌ను చూసిన త‌ర్వాత సినిమాలో ఎమోష‌న్ ఎలా ఉండ‌బోతుందో కూడా క్లారిటీ వ‌చ్చేసింది. గ్యాంగ్ లీడ‌ర్ ఆధారంగా తెర‌కెక్కుతుంద‌నే వార్త‌లు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇందులో చ‌ర‌ణ్ అన్న‌య్య‌లుగా ప్ర‌శాంత్, ఆర్య‌న్ రాజేష్ న‌టిస్తున్నారు. ఇప్పుడు పాట చూసిన త‌ర్వాత ఇంకాస్త క్లారిటీ వ‌చ్చేసింది. మొత్తానికి రేపు విన‌య విధేయ రాముడు ఎలా ఉంటాడ‌నేది థియేట‌ర్స్ లో సంక్రాంతికి తేల‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here