థ‌మ‌న్ మిగిలిన పాట‌లు కూడా ఇలాగే కొట్ట‌వా..?

ఇప్పుడు ఈ రిక్వ‌స్ట్ చేస్తున్న‌ది ఎవ‌రో కాదు.. ఎన్టీఆర్ అభిమానులు. కొన్నాళ్లుగా ఈయ‌న పాట‌ల్లో మార్పు క‌నిపిస్తుంది. ఒక‌ప్పుడు థ‌మ‌న్ అంటే బాబోయ్ అనేవాళ్లు. కానీ ఇప్పుడు అలా మొక్కుబ‌డిగా పాటలు కొట్ట‌డం మానేసాడు ఈయ‌న‌. ప్ర‌శాంతంగా కూర్చుని మంచి పాట‌లే ఇస్తున్నాడు. ఇప్పుడు విడుద‌లైన అర‌వింద స‌మేత పాట‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

ఆశ్చ‌ర్యం.. ఆనందం.. అంతుచిక్క‌ని విష‌యం.. ఇవ‌న్నీ ఈ మ‌ధ్య థ‌మ‌న్ పాట‌లు వింటుంటే వ‌స్తుంది. అంత ఆశ్చ‌ర్యం ఏముంది అందులో.. ఎప్పుడూ వినే పాట‌లే క‌దా అనుకుంటున్నారా..? ఎప్పుడూ వినే పాట‌లైతే పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. కానీ ఇప్పుడు థ‌మ‌న్ చాలా మారిపోయాడు. ఎవ‌రూ ఊహించ‌ని రేంజ్ లో ఏదో మాయ చేసాడు తొలిప్రేమ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి.

ఏం చేసాడో.. ఎంత క్లాస్ పీకాడో తెలియ‌దు కానీ తొలిప్రేమ నుంచి థ‌మ‌న్ మ్యూజిక్ అంతా మారిపోయింది. అప్ప‌ట్నుంచి ఆయ‌న పాట‌లు కూడా మారిపోతున్నాయి. అంత ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తున్నాడు థ‌మ‌న్. నితిన్ హీరోగా న‌టించిన ఛ‌ల్ మోహ‌న్ రంగాలో కూడా రెండుపాట‌లు బాగానే ఇచ్చాడు. పెద్ద‌పులి అంటూ ప‌క్కా మాస్ బీట్ విడుద‌ల చేసాడు థ‌మ‌న్.

ఇది ఆల్రెడీ తెలంగాణ‌లో ఉన్న ఫోక్ బీట్. దీన్నే త‌న‌దైన శైలిలో రీమిక్స్ చేసాడు థ‌మ‌న్. ఇక ఇప్పుడు అర‌వింద స‌మేత‌లో కూడా విడుద‌లైన పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇదే అల‌జ‌డి త‌ర్వాత కూడా ఉంటే బాగున్ను అంటున్నారు అభిమానులు. పైగా అఖిల్ సినిమాకు కూడా ఈయ‌నే సంగీత ద‌ర్శ‌కుడు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. థ‌మ‌న్ త‌ర్వాతి జ‌ర్నీ ఎలా ఉండ‌బోతుందో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *