ప్రముఖ నిర్మాత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి క‌న్నుమూత‌

ప్ర‌ముఖ నిర్మాత‌, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్ర‌సాద్ రెడ్డి(62) శనివారం ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు క‌న్నుమూశారు. హృద‌య సంబంధిత స‌మ‌స్య‌తో చెన్నైలోని అపోలో హాస్పిట‌ల్లో ఆయ‌నకు ఇటీవ‌ల ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ జ‌రిగింది.

Telugu producer D Shivaprasad Reddy Passed Away

ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు. 1985లో కామాక్షి మూవీస్ బ్యాన‌ర్‌ను స్థాపించి కార్తీక పౌర్ణ‌మి, శ్రావ‌ణ సంధ్య‌, విక్కీ దాదా, ముఠా మేస్త్రి, అల్ల‌రి అల్లుడు, ఆటోడ్రైవ‌ర్‌, సీతారామ‌రాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్‌, కింగ్, కేడీ, ర‌గ‌డ‌, ద‌ఢ‌, గ్రీకువీరుడు సినిమాల‌ను నిర్మించారు.ఈయ‌న మృతి ప‌ట్ల తెలుగు సినీ పరిశ్ర‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here