ఈ వారం సినిమాల‌న్నీ ఇలా అయ్యాయేంటి..?

ఒక్క హిట్.. దేవుడా ఒక్క హిట్.. అంటూ ఇప్పుడు ఇండ‌స్ట్రీ అంతా వేడుకుంటుంది. ఇప్ప‌టికే గీత‌గోవిందం దుమ్ము దులిపేస్తుంది. అయితే ఇదొక్క‌టి స‌రిపోదు.. అందుకే ఇంకో హిట్ కావాలంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

మూడు వారాలుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొమ్మ‌లు మారుతున్నాయి కానీ ఆ ప్లేస్ లో డామినేష‌న్ మాత్రం మార‌డం లేదు. ప్ర‌తీవారం ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా గీత‌గోవిందం మాత్రం దుమ్ము రేపుతూనే ఉంది. ఈ వారం కూడా ఇదే జ‌రిగింది. గ‌త‌వారం నీవెవ‌రో.. ఆటగాళ్లు లాంటి సినిమాల‌ను తొక్కేసిన గీత‌.. ఈ వారం త‌న కాలిని న‌ర్త‌న‌శాల‌పై పెట్టింది.

neevevaro aatagallu atnartansala paperboy reviews
neevevaro aatagallu atnartansala paperboy reviews

ఈ సినిమా కూడా విజ‌య్ దెబ్బ‌కు ఎగిరిపోయింది. నాగ‌శౌర్య భారీ ఆశ‌లు పెట్టుకున్న న‌ర్త‌న‌శాల సీన్ లో కూడా క‌నిపించ‌కుండా పోయింది. మ‌న ప్రేక్ష‌కుల‌కు అల‌వాటు లేని గే కామెడీని తీసుకొచ్చి.. అర్థం ప‌ర్థం లేని కామెడీ సీన్స్ తో సినిమాను నింపేయాల‌ని చూసాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి. కానీ ప్రేక్ష‌కులు ఆయ‌న కంటే తెలివైన వాళ్లు కదా.. అందుకే హ్యాండిచ్చారు.

దాంతో ఈ వారం సంద‌డి చేస్తుంద‌నుకున్న న‌ర్త‌న‌శాల నాట్యం లేకుండానే బంద్ అయిపోయింది. ఇక కోకో సినిమాకు కూడా న‌య‌న‌తార ఇమేజ్ క‌లిసిరాలేదు. ఈ చిత్రం కూడా అంతంత‌మాత్రంగానే ఆడుతుంది. మొత్తానికి మ‌రో వారం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి క‌నిపించ‌లేదు.. గీత‌గోవిందం త‌ప్ప‌. సెప్టెంబ‌ర్ 13న శైల‌జారెడ్డి అల్లుడు వ‌చ్చేవ‌ర‌కు ఈ ర‌చ్చ ఆగ‌దేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here