అంత‌రిక్షం డిసెంబ‌ర్ 21 నుంచి వాయిదా..

ఏమో ఇప్పుడు ఇదే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం అనుకున్న టైమ్ కు రావ‌డం క‌ష్టమే అంటున్నారు. దానికి కార‌ణం కూడా ఉంది. ఈ చిత్ర సిజి వ‌ర్క్ కూడా చాలా ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. అందుకే డిసెంబ‌ర్ 21న అంత‌రిక్షం రావ‌డం క‌ష్ట‌మే అంటున్నారు యూనిట్. అయితే అదే రోజు తీసుకురావ‌డానికి మ్యాగ్జిమ‌మ్ ట్రై చేస్తున్నారు కానీ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది చూడాలి. గ‌తేడాది ఘాజీతో ఈయ‌న సృష్టించిన సంచ‌ల‌నం చిన్న‌దేం కాదు. ఈయ‌న కృషిని గుర్తించి నేష‌న‌ల్ అవార్డ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ తో అంత‌రిక్షం నేప‌థ్యంలో సినిమా చేస్తున్నాడు.

Telugu movie antariksham postponed

ఇప్ప‌టి వ‌ర‌కు అంతా బాగానే ఉంది కానీ డిసెంబ‌ర్ 21న విడుద‌ల మాత్రం క‌ష్ట‌మే అనిపిస్తుంది. ఈ సినిమాపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా వ‌రుణ్ తేజ్ కూడా ఇప్పుడు ఫిదా.. తొలిప్రేమ వ‌ర‌స విజ‌యాలు సాధించినందుకు కాదు.. మ‌రో కార‌ణంతో గాల్లో తేలిపోనున్నాడు. ఈ రెండు సినిమాల‌తో మ‌నోడి మార్కెట్ పెరిగింది. దాంతో భారీ బ‌డ్జెట్ సినిమాలు చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు నిర్మాత‌లు.

ఈ కుర్ర హీరో ఇప్పుడు 25 కోట్ల బ‌డ్జెట్ ఉన్న సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. స్పేస్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా కాబ‌ట్టి ఆ మ‌ధ్య క‌జ‌కిస్థాన్ వెళ్లి జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకున్నాడు వ‌రుణ్ తేజ్. రాజ‌వ్ రెడ్డి.. సాయిబాబా.. క్రిష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ కు జోడీగా లావ‌ణ్య త్రిపాఠి.. అదితిరావ్ హైద్రీ న‌టిస్తున్నారు. ఇలాంటి క‌థ‌తో ఇప్ప‌టికే త‌మిళ‌నాట టిక్ టిక్ టిక్ అనే సినిమా వ‌చ్చింది. అయితే అది ఆడ‌లేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. సిజి వ‌ర్క్ అనుకున్న స‌మ‌యానికి వ‌ర్క‌వుట్ అయితే సినిమా డిసెంబ‌ర్ 21న రావ‌డం ఖాయం. కానీ చూడాలిక‌.. ఇప్పుడు ఈ 15 రోజుల్లో ఏం మార్పులు జ‌రుగుతాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here