ఎన్టీఆర్ బయోపిక్ పై ఎన్నిక‌ల ప్ర‌భావం..

తెలంగాణ ఎల‌క్ష‌న్స్ ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ కు బ్రేక్ ఇచ్చేలా చేస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ చేస్తున్న బాల‌కృష్ణ‌.. ఇప్పుడు ఎన్నిక‌ల కోసం కొన్ని రోజులు షూటింగ్ కు దూరం కానున్నాడు. ఇప్ప‌టికే తొలి భాగం క‌థానాయ‌కుడు షూటింగ్ దాదాపు పూర్తైపోయింది.

ntrbiopic

ఈ చిత్రం అనుకున్న‌ట్లుగానే జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. ఇక రెండో భాగం మాత్రం ఎన్నిక‌ల త‌ర్వాత మిగిలిన పార్ట్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు బాల‌య్య‌. నవంబర్ 25 నుంచి తెలుగుదేశం కోసం ప్రచారం చేయబోతున్నాడు బాలయ్య. దీనికోస‌మే ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నాడు. వ‌చ్చిన త‌ర్వాత రెండో భాగంపై దృష్టి పెడ‌తాడు. డిసెంబ‌ర్ 7న పోలింగ్ ఉండ‌టంతో అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారంతోనే బిజీగా ఉండ‌బోతున్నాడు ఈ హీరో.

అందుకే ఇప్పుడు ఉన్న ప‌ది రోజుల్లో ఎంత వీలైతే అంత షూటింగ్ చేయాల‌ని చూస్తున్నారు బాల‌య్య‌.. క్రిష్. మ‌రి చూడాలిక‌.. క‌థానాయ‌కుడు విడుద‌లపై ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు కానీ మ‌హానాయ‌కుడు మాత్రం అనుకున్న స‌మ‌యానికి వ‌స్తుందా అనే అనుమానాలు అంద‌ర్లోనూ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here