రివ్యూ: టాక్సీవాలా

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:2

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

టాక్సీవాలా.. ఎంజాయ్ ది రైడ్.. కండీష‌న్స్ అప్లై..
Rating: 3/5

www.teluguodu.com

టాక్సీవాలా – సరదాగా సాగిపోయే రైడ్
Rating: 3.25/5

www.123telugu.com

రివ్యూ       : టాక్సీవాలా
న‌టీన‌టులు : విజ‌య్ దేవ‌రకొండ‌, ప్రియాంక జవాల్క‌ర్, మాళ‌విక న‌య్య‌ర్, మ‌ధు, ర‌వివ‌ర్మ‌, య‌మున‌, క‌ళ్యాణి
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: రాహుల్ సంక్రీత్య‌న్
నిర్మాత‌      : ఎస్ కే ఎన్

అర్జున్ రెడ్డి, గీత‌గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత నోటా ఫ్లాప్ కావ‌డంతో ఒక్క‌సారిగా విజ‌య్ రేంజ్ ప‌డిపోయింది. మ‌ళ్లీ వ‌న్ మూవీ వండ‌ర్ అయిపోతాడేమో అనుకున్నారంతా. ఇలాంటి టైమ్ లో అంచ‌నాలే లేని టాక్సీవాలాతో వ‌చ్చాడు. మ‌రి ఈ చిత్రం విజ‌య్ ను ఏం చేస్తుంది..?

క‌థ‌:
శివ‌(విజ‌య్ దేవ‌ర‌కొండ‌) డిగ్రీ పూర్తి చేసుకుని హైద‌రాబాద్ కు వ‌స్తాడు. అన్నా (ర‌విప్ర‌కాశ్), వ‌దిన‌(క‌ళ్యాణి)ల ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకుని వ‌చ్చి ఇక్క‌డే ఓ టాక్సీ కొంటాడు. హాయిగా సంపాదిస్తుంటాడు. అదే స‌మ‌యంలో డాక్ట‌ర్ అను(ప్రియాంక‌)తో ప‌రిచ‌యం అవుతుంది. ఆ త‌ర్వాత ప్రేమ పుడుతుంది. లైఫ్ జాలీగా సాగిపోతున్న స‌మ‌యంలో అనుకోకుండా శివ జీవితంలోకి ఆత్మ‌ శిశిర (మాళ‌విక న‌య్య‌ర్) వ‌స్తుంది. అది అదే కార్ లో ఉంటుంది కూడా. కానీ ప్రాణం మాత్రం ఉంటుంది.. అస‌లు ఆ కార్ లో శిశిర ఆత్మ ఎలా వ‌చ్చింది..? ఈ కార్ తో ఆత్మ‌కు ఏంటి సంబంధం.. అస‌లు శివ ఏం చేస్తాడు ఆ త‌ర్వాత అనేది అస‌లు క‌థ‌..

taxiwaala rewiew and Rating
taxiwaala rewiew and Rating

Taxiwaala Movie Review and Rating

క‌థ‌నం:
కొన్ని సినిమాలపై ఎటువంటి అంచనాలు కానీ.. ఆసక్తి గాని ఉండదు. కొన్నిసార్లు అదే ప్లస్ అవుతుంది కూడా వాటికి.. టాక్సీవాలాకి ఇదే జరిగింది ఇప్పుడు. జీరో మైండ్ సెట్ తో వెళ్ళిన వాళ్ళకి మంచి సర్ ప్రైజ్ ఈ సినిమా. నోటా ప్లాప్ కావడం.. టాక్సీవాలా రిలీజ్ లేట్ కావడం.. పైరసీ.. ఇవన్నీ సినిమాపై ఆసక్తి తగ్గించాయి. ఈ మధ్య విజయ్ దేవరకొండ సినిమా ఇంత తక్కువ అంచనాలతో రావడం కూడా కలిసొచ్చింది. మంచి కథ ఉండటం.. అది కూడా కాస్త ఆలోచనాత్మకంగా ఉండటం టాక్సీవాలాకి కలిసొచ్చే అంశం. హారర్ కామెడీ కలిస్తే ఫార్ములా సూపర్ హిట్ అంటారు.. టాక్సీవాలా ఆ రేంజ్ అవుతుందా లేదా అనేది పక్కన బెడితే కచ్చితంగా నవ్విస్తుంది.

అక్కడక్కడా భయపెడుతోంది కూడా.. తెలిసిన దెయ్యం కథకి తెలియని సైన్స్ జోడించాలన్న దర్శకుడి ఆలోచన బాగుంది. రాసుకున్న కథని పక్కదారి పట్టకుండా సూటిగా చెప్పడం సినిమాకు పెద్ద ప్లస్. పాటల కోసం.. కామెడీ కోసం ఆరాటపడలేదు.. కథతోనే అవి సాగిపోయాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది.. సస్పెన్స్ బానే బ్యాలన్స్ చేసాడు దర్శకుడు. కామెడీ బాగా వర్కవుట్ అయింది.. ఇంటర్వెల్ సీన్ బాగా రాసుకున్నాడు రాహుల్. తెలిసిన కథకి తెలివైన స్క్రీన్ ప్లే బాగా పని చేసింది. సెకండాఫ్ ఎమోషనల్ గా ఉంది.

Amar Akbar Anthony review amar akbar anthony

కాస్త స్లోగా అనిపించినా.. కథ ఆసక్తికరంగా సాగింది.. కథ నయనతార డోరా గుర్తుకు తెచ్చినా.. బాగానే హ్యాండిల్ చేసాడు దర్శకుడు. విజయ్ దేవరకొండ మరోసారి ఆకట్టుకున్నాడు.. కామెడీ టైమింగ్ ప్లస్. తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ బాగా చేసింది. మాళవిక నయ్యర్ కీలక పాత్రలో నటించింది. విజయ్ ఫ్రెండ్ హాలీవుడ్ పాత్రలో బాగా నవ్వించాడు. ముఖ్యంగా సెకండాఫ్ మార్చురీ సీన్ అయితే అదిరిపోయింది. ఓవరాల్ గా టాక్సీవాలా.. అంచనాలు లేకుండా వెళ్తే అలరిస్తుంది.

న‌టీన‌టులు:
విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ తో బాగానే న‌వ్వించాడు. ముఖ్యంగా హాలీవుడ్ పాత్ర‌తో క‌లిసి బాగా న‌వ్వించాడు విజ‌య్. ఎమోష‌న‌ల్ సీన్స్ కూడా బాగానే చేసాడు విజ‌య్. తెలుగ‌మ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్ కు క‌థ‌లో పెద్ద‌గా ప్రాముఖ్య‌త లేని పాత్ర వ‌చ్చింది. కానీ ఉన్నంత‌లో బాగానే చేసింది. శిశిర పాత్ర‌లో మాళ‌విక న‌య్య‌ర్ మెప్పించింది. ఈ సారి గ్లామ‌ర్ డోస్ కూడా పెంచేసింది ఈ భామ‌. హీరో ఫ్రెండ్స్ పాత్ర‌ల్లో మ‌ధు, విష్ణు బాగా న‌టించారు. ముఖ్యంగా హాలీవుడ్ పాత్ర బాగా పేలింది. సిజ్జు, య‌మున‌, క‌ళ్యాణీ అంతా ఉన్న మేర‌కు బాగానే న‌టించారు. ఛ‌మ్మ‌క్ చంద్ర రెండు సీన్ల‌లోనూ న‌వ్వించాడు.

టెక్నిక‌ల్ టీం:
హార్ర‌ర్ కామెడీస్ కు ఆర్ఆర్ తోనే ఎక్కువ‌గా ప‌ని ఉంటుంది. అది బాగుంటేనే సినిమా వ‌ర్క‌వుట్ అవుతుంది కూడా. టాక్సీవాలాలో జేక్స్ బిజయ్ ఈ విష‌యంలో స‌క్సెస్ అయ్యాడు. మ‌నోడు పాట‌ల‌తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చాడు. ముఖ్యంగా మాటే విన‌దుగా పాట ఇప్ప‌టికే పెద్ద హిట్. సినిమాలో మిగిలిన పాట‌లు కూడా ప‌ర్లేదు. ఎడిటింగ్ బాగుంది. ముందే ఔట్ పుట్ చూసుకుని చాలా సీన్స్ క‌ట్ చేసుకున్నారు. కామెడీ కూడా బాగానే వ‌ర్క‌వుట్ అయ్యేలా సీన్స్ క‌ట్ చేసుకున్నారు. సినిమాటోగ్ర‌పీ ప‌ర్లేదు. డోరా క‌థ‌నే గుర్తు చేసినా కూడా సైన్స్ ఫిక్ష‌న్ ట‌చ్ ఇచ్చి కొత్త రూపం తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రీత్య‌న్. ది ఎండ్ సినిమాతో ప‌ర్లేద‌నిపించిన రాహుల్.. ఈ సారి కూడా బాగానే మెప్పించాడు. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసాడు. తెలిసిన క‌థ‌నే తెలియ‌ని సైన్స్ జోడించి అద్భుతంగా రాసుకున్నాడు. ఓవ‌రాల్ గా క‌థ నార్మ‌ల్ గానే ఉన్నా క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా ఉండ‌టం టాక్సీవాలాకు క‌లిసొచ్చింది.

చివ‌ర‌గా:
టాక్సీవాలా.. ఎంజాయ్ ది రైడ్.. కండీష‌న్స్ అప్లై..

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here