టాక్సీవాలా దున్నేస్తున్నాడు బాబోయ్..

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే ప్రేక్ష‌కులు ముందుగా ఊహించుకునేది ఏంటి.. ఎంట‌ర్ టైన్మెంట్ ఎంట‌ర్ టైన్మెంట్.. మ‌నోడి కామెడీ టైమింగ్ అలా ఉంటుంది మ‌రి. గీత‌గోవిందం అంత పెద్ద విజయం సాధించిందంటే దానికి కార‌ణం విజ‌య్ ఇమేజ్ తో పాటు అత‌డి డైలాగ్ డెల‌వ‌రీ కూడా.

taxiwala

ఇప్పుడు టాక్సీవాలాలో మ‌రోసారి అదే క‌నిపిస్తుంది. ఈ చిత్రాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేసారు కానీ ఇప్పుడు ఇందులో విష‌యం బాగానే ఉంద‌ని సినిమా చూసిన త‌ర్వాత అర్థ‌మైపోయింది. ఈ చిత్రం విడుద‌లైన తీరుకు ఇప్పుడు వ‌స్తున్న క‌లెక్ష‌న్ల‌కు అస్స‌లు సంబంధ‌మే లేదు. తొలిరోజే ఈ చిత్రం 10 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది. తొలిరోజే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయిందంటే టాక్సీవాలా ర‌చ్చ ఎలా ఉందో అర్థ‌మైపోతుంది క‌దా.

రాహుల్ సంక్రీత్య‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ 2.. యువీ క్రియేష‌న్స్ నిర్మించాయి. చ‌దువు అయిపోయిన త‌ర్వాత ఏం చేయాలో తెలియ‌క ఖాళీగా కాలం గ‌డిపేస్తున్న ఓ కుర్రాడి జీవితంలోకి కార్ వ‌స్తుంది.. అయితే అది మామూలు కార్ కాదు.. అందులో ఏదో మాన‌వాతీత శ‌క్తులు ఉంటాయి. అప్పుడు ఆ కుర్రాడి లైఫ్ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అనేది క‌థ‌. స్టోరీ ఆస‌క్తిక‌రంగానే ఉంది కానీ లేట్ అవ్వ‌డంతో సినిమాపై ఆస‌క్తి త‌గ్గిపోయింది. కానీ ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్ ప్ల‌స్ క‌థ కూడా బాగుండ‌టంతో సినిమా ఫుల్లుగా కుమ్మేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here