ఆర్టీసికి రుణ‌ప‌డిపోయిన ఆ ఇద్ద‌రు సూప‌ర్ స్టార్లు..

సినిమా ఇండస్ట్రీకి ఆర్టీసీకి.. ఏదో తెలియని సంబంధం ఉంది. ఆర్టీసీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు రజనీకాంత్. ఈయన జీవితం అక్కడి నుంచి మొదలైంది మ‌రి. మరాఠీ కుటుంబంలో పుట్టిన శివాజీరావు గైక్వాడ్.. కర్ణాటక ఆర్టీసీలో కండెక్ట‌ర్ గా పని చేశాడు. అక్కడే తను టికెట్లు ఇచ్చే స్టైల్ నచ్చి తోటి ఉద్యోగులు ఆయ‌న్ని సినిమాల్లోకు వెళ్లాలంటూ ప్రోత్సహించారు.

Tamil Heros Connection With KSRTC

అది నమ్మే రజినీకాంత్ మద్రాసు వచ్చారు.. శివాజీ కాస్త సూపర్ స్టార్ అయ్యాడు. ఎంత ఎదిగినా కూడా తాను ఆర్టీసీకి ఎప్పుడూ రుణపడే ఉంటాన‌ని చెబుతూ ఉంటాడు రజనీకాంత్. ఇక ఇప్పుడు ఇదే ఆర్టీసీ కుటుంబం నుంచి మరో సూప‌ర్ స్టార్ వ‌చ్చాడు. ఆయన మరెవరో కాదు ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీతో పాటు ఇండియన్ బాక్సాఫీస్ ను దున్నేస్తున్న కేజిఎఫ్ హీరో య‌శ్. ఈయన కూడా ఆర్టీసీ కుటుంబం నుంచే వచ్చాడు. య‌శ్ తండ్రి అరుణ్ కుమార్ కర్ణాటక ఆర్టీసీలో డ్రైవర్. ఇప్ప‌టికీ ఆయ‌న ఆ ఉద్యోగం చేస్తున్నాడు.

కొడుకు సూపర్ స్టార్ అయినా కూడా ఉద్యోగం మాన‌లేదు అరుణ్ కుమార్. య‌శ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరు య‌శ్ గా మార్చుకున్నాడు. అయితే తాను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకును అని చెప్పుకోడానికి గర్వపడతాను అంటున్నాడు ఈ హీరో. కొడుకు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నాడంటే.. అది ఆ కుటుంబం ఆర్టీసీకి ఇస్తున్న గౌర‌వం.

నిజంగానే ఇప్పుడు రజనీకాంత్, య‌శ్ ల‌ను చూస్తుంటే ఆర్టీసీకి సినిమా ఇండస్ట్రీకి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపిస్తుంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలో జెండా పాతేస్తున్నారు. ఇప్పుడంటే ర‌జినీకాంత్ తమిళ సూప‌ర్ స్టార్ కానీ.. ఆయ‌న పునాదులు మొత్తం ఉన్న‌ది క‌న్న‌డ నేల‌పైనే. దాంతో ఇప్పుడు కర్ణాటక ఆర్టీసీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుందిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here