చిరంజీవి అంత సాహ‌సం చేస్తున్నాడా.. బాబోయ్ బాసు కేకే..

సైరా షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. అక్క‌డే మేజ‌ర్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. అయితే దాని కంటే ముందు మ‌రో భారీ ట్రైనింగ్ పీరియ‌డ్ ఉంది. ఎందుకంటే అక్క‌డ చేయాల్సిన వార్ సీక్వెన్స్ భూమిపై కాదు.. నీటిలో.

syeraa

 

అండ‌ర్ వాట‌ర్ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఇప్పుడు దీని కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుంటున్నాడు మెగాస్టార్. ఒక్క‌సారి ట్రైనింగ్ పూర్తైందంటే ముంబైలోనే నాన్ స్టాప్ గా జ‌ర‌గ‌నుంది ఈ షెడ్యూల్. చాలా ఇబ్బందులు ప‌డుతూ ఈ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఎందుకంటే విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో ఉండే కెమెరాల‌తో సైరా షూట్ జ‌రుగుతుంది. బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాలవాడ పోరాడే అండ‌ర్ వాట‌ర్ స‌న్నివేశాలు ఇవి. దీనికోసం చిరు కూడా ప్ర‌త్యేకంగా చెమ‌టోడుస్తున్నాడు.

ఇంత వ‌య‌సులో కూడా చిరు అరాచ‌కం చేస్తున్నాడు. సైరా కోసం జేమ్స్ బాండ్ ఫేమ్ గ్రెగ్ పావెల్ టాలీవుడ్ కు వ‌స్తున్నాడు. ఈయ‌న గ‌తంలో చాలా హాలీవుడ్ సినిమాల‌కు ప‌ని చేసాడు. జేమ్స్ బాండ్ సిరీస్ లోని స్కై ఫాల్ కి కూడా గ్రెగ్ ఫైట్స్ కంపోజ్ చేసాడు. ఈ మ‌ధ్యే ఇప్పుడు లీ విక్ట‌ర్ వ‌చ్చాడు. ఇప్పుడు మ‌రో హాలీవుడ్ టీం కూడా వ‌చ్చింది సైరా కోసం.

ఇందులో క‌ళ్లు బైర్లు గ‌మ్మే ఫీట్లు చిరంజీవితో చేయిస్తున్నాడు ఈ స్టంట్ మాస్ట‌ర్. మ‌రోవైపు చిరు కూడా 63 ఏళ్ల వ‌య‌సులోనూ అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఈ షెడ్యూల్లో బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాల‌వాడ పోరాడి మ‌రీ గ‌న్స్ అన్నీ దోచుకునే సీన్స్ చిత్రీక‌రించారు. ఇవి మ‌రో స్థాయిలో ఉండాలని ప్లాన్ చేసిన సురేంద‌ర్ రెడ్డి.. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ ను రంగంలోకి దించాడు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. మ‌రి చూడాలిక‌.. సైరాలో చిరు చేయ‌బోయే ఆ వార్ సీక్వెన్సులు ఎలా ఉండ‌బోతున్నాయో..?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here