త్రివిక్ర‌మ్ ఇలా చేసాడేంటి.. సునీల్ ప‌రిస్థితేంటి..?

సునీల్ కెరీర్ కావాల్సిన‌న్ని మ‌లుపులు తీసుకుంటుంది. ఎప్పుడు ఎలా మార‌తాడో కూడా ఊహించ‌డం క‌ష్టంగా ఉంది ఇప్పుడు. ఒక‌ప్పుడు క‌మెడియ‌న్ గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు.. ఆ త‌ర్వాత హీరోగా మారాడు.. ఇప్పుడు మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా వ‌స్తున్నాడు అనుకున్నారు కానీ అర‌వింద స‌మేత‌లో ఆయ‌న కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా వ‌చ్చాడు. అయినా హీరోగా ఉన్న‌పుడు సినిమా భారం అంతా సునీలే మోయాలి. అది ఫ్లాప్ అయితే ఆ భారం అంతా ఈయ‌న నెత్తిపైనే ప‌డేది.

sunil comedy in aravinda sametha

కానీ ఇప్పుడు మ‌ళ్లీ ఈయ‌న క‌మెడియ‌న్ అయిపోయాడు. ఇప్పుడు విడుద‌లైన సిల్లీఫెలోస్ ఫ‌లితం ఎలా వ‌చ్చినా కూడా సునీల్ సూప‌ర్ హిట్ అయ్యాడు. ప‌దేళ్ల త‌ర్వాత క‌మెడియ‌న్ గా వ‌చ్చినా కూడా ఇప్ప‌టికీ అదే న‌వ్వులు పూయించి ఔరా అనిపించాడు.
ఇక ఇప్పుడు అర‌వింద స‌మేత‌లో కూడా న‌వ్వులు కాకుండా స‌ర‌దా పాత్ర‌లో అల‌రించాడు. ఇది చూసిన త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ సునీల్ కోసం ద‌ర్శ‌కుల వేట మొద‌లైంది. ఈయ‌న కోసం కారెక్ట‌ర్లు రాయ‌డం షురూ చేసారు. ఇన్నాళ్లూ ఈయ‌న క‌మెడియ‌న్ గానే కాకుండా కారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ వాడుకోవాల‌ని ఫిక్సైపోతున్నారు.

దాంతో సునీల్ ఇంక ప్ర‌శాంతంగా క‌మెడియ‌న్ గా కంటిన్యూ అయిపోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ విడుద‌ల‌కు సిద్ధంగానే ఉంది. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. ఈ స‌రికొత్త సునీల్ ను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చేస్తోన్న సినిమాల‌న్నీ ఇప్పుడు వేగంగా షూట్ జ‌రుపుకుంటున్నాయి. అయితే ఇన్నేళ్ళ త‌ర్వాత వ‌చ్చినా కూడా అదే రేంజ్ పారితోషికం తీసుకుంటూ అద్బుతాలు చేస్తున్నాడు సునీల్. అప్పుడెప్పుడో 2013లో పూల‌రంగ‌డితో వ‌చ్చిన విజ‌యం.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. అందుకే అన్నీ మానేసి కొత్త‌గా ట్రై చేస్తున్నాడు సునీల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *