సుమంత్ కు ఇప్పుడు నిల‌బడేంత స‌త్తా ఉందా..?

ఒక్క సినిమా చాలు.. మ‌రిచిపోయిన హీరోను మ‌ళ్లీ గుర్తు చేయ‌డానికి..! గ‌తేడాది సుమంత్ విష‌యంలో ఇదే జ‌రిగింది. అప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ మ‌రిచిపోయిన సుమంత్ ను మ‌ళ్లీరావా మ‌ళ్లీ గుర్తు చేసింది. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా విజ‌యం సాధించ‌లేదు కానీ సుమంత్ అనే ఓ హీరో ఉన్నాడ‌నే విష‌యం మాత్రం గుర్తు చేసింది. గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

sumanth,subramaniapuram,ntr biopic

ఇక ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు నానితో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మ‌ళ్లీ రావా ఇచ్చిన స్పూర్థితో ఇప్పుడు మ‌రో రెండు సినిమాలు చేస్తున్నాడు సుమంత్. ఈ రెండు సినిమాల టీజ‌ర్స్ కానీ.. ట్రైల‌ర్స్ కానీ ఆస‌క్తిక‌రంగానే ఉన్నాయి. గ‌తంలో సుమంత్ సినిమాల మాదిరి తీసిపారేయ‌డానికి అయితే లేదు. వీటిలో ఇదం జ‌గ‌త్ మీడియా నేప‌థ్యంలో అనిల్ శ్రీ‌కంఠం తెర‌కెక్కిస్తున్నాడు.
ఇక దాంతో పాటే సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం సినిమాతో వ‌స్తున్నాడు.

ఇది ఈ హీరోకు 25వ సినిమా కావ‌డం మ‌రో విశేషం. సంతోష్ జాగ‌ర్ల‌పూడి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం కార్తికేయ త‌ర‌హాలో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి గుడి చుట్టూ తిరిగే క‌థ‌తో వ‌స్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఏదో అల్లాట‌ప్పాగా తీసిన క‌థ‌లా మాత్రం క‌నిపించ‌డం లేదు. క‌చ్చితంగా సుమంత్ ఇప్పుడు క‌సిమీదున్నాడ‌ని అర్థ‌మైపోతుంది. ఈ రెండు సినిమాల‌తో ఆయ‌న మ‌ళ్లీ నిల‌బ‌డ‌తాడా అనేది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. దాంతోపాటు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఏఎన్నార్ గా న‌టిస్తున్నాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. ఇప్పుడు సుమంత్ కెరీర్ ఎటు వెళ్ల‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here